అక్టోబర్ 11 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 19 వరకు నవరాత్రులు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి వివిధ రూపాలను పూజిస్తారు. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట రంగు దుస్తులను ధరించే సంప్రదాయం కూడా ఉంది.

అమ్మవారి తొమ్మిది రూపాలకు, తొమ్మిది రంగులకు ప్రత్యేకత ఉంది. అయితే, నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ రోజు ఏ రంగును ధరించాలి? ఏ రోజు ఏ రంగును ధరిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి?
అక్టోబర్ 11, ఆదివారం నారింజ రంగు.. అక్టోబర్ 12, సోమవారం నాడు తెలుపు రంగు ధరించాలన్న విషయం మనకు తెలిసిందే.
అక్టోబర్ 13, మంగళవారం: ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఈ రంగు ప్రేమ, ఉత్సాహానికి చిహ్నం. ఈ రంగును ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రంగు దుర్గాదేవి తేజస్సును, శక్తిని మనకు గుర్తుచేస్తుంది.
అక్టోబర్ 14, బుధవారం: అక్టోబర్ 14, బుధవారం నాడు ముదురు నీలం రంగు దుస్తులను ధరించడం మంచిది. ఈ నీలం రంగు దుస్తులను ధరించడం వలన విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ రంగు పండుగకు ఆకర్షణీయమైన, ఉత్సాహవంతమైన రూపాన్ని కలిగిస్తుంది.
అక్టోబర్ 15, గురువారం: అక్టోబర్ 15, గురువారం నాడు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఈ రంగు దుస్తులు అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఆనందం, సంతోషం, జ్ఞానంకి చిహ్నం. పసుపు రంగు దుస్తులను ధరించడం వలన ఉత్సాహాన్ని పెంపొందించుకోవచ్చు. శుభప్రదమైన వాతావరణాన్ని కూడా ఈ రంగు సూచిస్తుంది.
అక్టోబర్ 16, శుక్రవారం: ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుకు ఆకుపచ్చ రంగు ప్రతీక. కాత్యాయనీ దేవిని ఆరాధించేటప్పుడు ఈ రంగు దుస్తులను ధరించండి. అమ్మవారి అనుగ్రహం కలిగి కొత్త ఆశలు, సానుకూల మార్పులను పెంపొందించుకోవచ్చు.
అక్టోబర్ 17, శనివారం: ఆ రోజు బూడిద రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ధైర్యాన్ని, మానసిక సమతుల్యతను ఇది ప్రేరేపిస్తుంది. కనుక ఈ రంగు దుస్తులను ధరించండి.
{{/usCountry}}అక్టోబర్ 17, శనివారం: ఆ రోజు బూడిద రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ధైర్యాన్ని, మానసిక సమతుల్యతను ఇది ప్రేరేపిస్తుంది. కనుక ఈ రంగు దుస్తులను ధరించండి.
{{/usCountry}}అక్టోబర్ 18, ఆదివారం: ఆ రోజు ఊదా రంగు ధరించడం వలన మంచి ఫలితం ఉంటుంది. పండుగ సౌందర్యాన్ని ఇది పెంపొందిస్తుంది. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు గౌరీదేవిని ఆరాధించేటప్పుడు కచ్చితంగా ఈ రంగు దుస్తులను ధరిస్తే మంచిది.
అక్టోబర్ 19, సోమవారం: సోమవారం నాడు నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితాన్ని చూడొచ్చు. నవరాత్రి పండుగకు ఈ రంగు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగిస్తుంది. నూతన జీవితానికి, కరోనాకు చిహ్నం ఇది.