దసరా నవరాత్రులు 2026: నవరాత్రుల్లో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ రంగుతో ఎలాంటి ఫలితాలు?
దసరా నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి 19 వరకు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ ప్రత్యేక రంగు దుస్తులను ధరించే సంప్రదాయం ఉంది. నవరాత్రుల్లో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ రంగుతో ఎలాంటి ఫలితాలు?
అక్టోబర్ 11 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 19 వరకు నవరాత్రులు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి వివిధ రూపాలను పూజిస్తారు. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట రంగు దుస్తులను ధరించే సంప్రదాయం కూడా ఉంది.

అమ్మవారి తొమ్మిది రూపాలకు, తొమ్మిది రంగులకు ప్రత్యేకత ఉంది. అయితే, నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ రోజు ఏ రంగును ధరించాలి? ఏ రోజు ఏ రంగును ధరిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి?
అక్టోబర్ 11, ఆదివారం నారింజ రంగు.. అక్టోబర్ 12, సోమవారం నాడు తెలుపు రంగు ధరించాలన్న విషయం మనకు తెలిసిందే.
అక్టోబర్ 13, మంగళవారం: ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఈ రంగు ప్రేమ, ఉత్సాహానికి చిహ్నం. ఈ రంగును ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రంగు దుర్గాదేవి తేజస్సును, శక్తిని మనకు గుర్తుచేస్తుంది.
అక్టోబర్ 14, బుధవారం: అక్టోబర్ 14, బుధవారం నాడు ముదురు నీలం రంగు దుస్తులను ధరించడం మంచిది. ఈ నీలం రంగు దుస్తులను ధరించడం వలన విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ రంగు పండుగకు ఆకర్షణీయమైన, ఉత్సాహవంతమైన రూపాన్ని కలిగిస్తుంది.
అక్టోబర్ 15, గురువారం: అక్టోబర్ 15, గురువారం నాడు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఈ రంగు దుస్తులు అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఆనందం, సంతోషం, జ్ఞానంకి చిహ్నం. పసుపు రంగు దుస్తులను ధరించడం వలన ఉత్సాహాన్ని పెంపొందించుకోవచ్చు. శుభప్రదమైన వాతావరణాన్ని కూడా ఈ రంగు సూచిస్తుంది.
అక్టోబర్ 16, శుక్రవారం: ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుకు ఆకుపచ్చ రంగు ప్రతీక. కాత్యాయనీ దేవిని ఆరాధించేటప్పుడు ఈ రంగు దుస్తులను ధరించండి. అమ్మవారి అనుగ్రహం కలిగి కొత్త ఆశలు, సానుకూల మార్పులను పెంపొందించుకోవచ్చు.
అక్టోబర్ 17, శనివారం: ఆ రోజు బూడిద రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ధైర్యాన్ని, మానసిక సమతుల్యతను ఇది ప్రేరేపిస్తుంది. కనుక ఈ రంగు దుస్తులను ధరించండి.
అక్టోబర్ 18, ఆదివారం: ఆ రోజు ఊదా రంగు ధరించడం వలన మంచి ఫలితం ఉంటుంది. పండుగ సౌందర్యాన్ని ఇది పెంపొందిస్తుంది. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు గౌరీదేవిని ఆరాధించేటప్పుడు కచ్చితంగా ఈ రంగు దుస్తులను ధరిస్తే మంచిది.
అక్టోబర్ 19, సోమవారం: సోమవారం నాడు నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితాన్ని చూడొచ్చు. నవరాత్రి పండుగకు ఈ రంగు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగిస్తుంది. నూతన జీవితానికి, కరోనాకు చిహ్నం ఇది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


