...
...
Next Story

Easy Daily Puja: నిత్య పూజ ఎలా చేసుకోవాలి? కేవలం 8 ఈజీ స్టెప్స్‌లో పూజా విధానం!

బిజీ లైఫ్ స్టైల్‌లో దేవుడికి పూజ ఎలా చేయాలో అర్థం కావడం లేదా? శాస్త్రం ప్రకారం తక్కువ సమయంలోనే మనసుకి ప్రశాంతతను, ఆ భగవంతుడి అనుగ్రహాన్ని ఇచ్చే 'సరళ నిత్య పూజా విధానం' మీకోసం ఇక్కడ ఉంది. నిత్య పూజ ఎలా చేయాలి? కేవలం 8 సులువైన స్టెప్స్‌లో సంప్రదాయ పూజా విధానం మీకోసం.

Published on: Apr 18, 2026, 13:30:23 IST
Advertisement

ప్రతిరోజూ కూడా ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకుంటూ ఉంటాము. అయితే, ఎవరి వీలును బట్టి వారు పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి సమయం ఉండి కాస్త ఎక్కువసేపు పూజ చేసుకుంటే, కొంతమంది త్వరగా పూజ చేసుకుని వారి పనులను చేసుకుంటూ ఉంటారు. అయితే, శాస్త్రం ప్రకారం నిత్య పూజను ఎలా చేయాలి? మీరు బిగినర్ అయినా కూడా సులువుగా ఎలా పూజ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.

పూజ చేసుకుంటే కలిగే ప్రయోజనాలు:

Easy Daily Puja: నిత్య పూజ ఎలా చేసుకోవాలి? కేవలం 8 ఈజీ స్టెప్స్‌లో పూజా విధానం (pinterest)
Easy Daily Puja: నిత్య పూజ ఎలా చేసుకోవాలి? కేవలం 8 ఈజీ స్టెప్స్‌లో పూజా విధానం (pinterest)

పూజ చేయడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. మనసు శుద్ధి అవుతుంది. మనం రోజును పాజిటివ్‌గా స్టార్ట్ చేయొచ్చు.

పూజకు కావాల్సిన వస్తువులు:

పూజకు కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే.. దీపం, సామాగ్రి, ధూపానికి సామాగ్రి, పువ్వులు, దేవుడి చిత్రపటం, గంట, కలశం, నైవేద్యానికి సామాగ్రి.

పూజ ఎందుకు చెయ్యాలి?

ఈ రోజుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసును నిలకడగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకు పూజ సరైన మార్గం అని చెప్పొచ్చు. అలాగే పూజ చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఇక పూజ ఎలా చేయాలి అనే దాని గురించి చూసేద్దాం. కేవలం ఈ సులువైన పది స్టెప్స్‌లో పూజను ఎలా చేసుకోవచ్చు?

8 స్టెప్స్‌లో పూజ ఎలా చేసుకోవచ్చు?

1.గణపతి ప్రార్ధన:

ముందు గణపతి ప్రార్ధన. గణపతిని మొదట ప్రార్థిస్తే విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కనుక శుక్లాం బరధరం శ్లోకం చెప్పి మొదలు పెట్టండి.

2.సంకల్పం చెప్పుకోండి:

పూజ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పడమే సంకల్పం. చేతిలో నీళ్లు వేసుకుని ''ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి'' అలా మీకు కావల్సినది చెప్పి ఒక పళ్లెంలో వదిలిపెట్టేయండి.

3.ఆచమానం

ధ్యానం అంటే దైవంపై దృష్టి పెట్టడమే.

5.దీపం, ధూపం

ఇది చాలా ముఖ్యమైనది. దీపం వెలిగించి ఆ దీపానికి అక్షింతలు, పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆ తరవాత ధూపం వెలిగించి చూపించండి.

6.పూలతో పూజ

మీకు అందుబాటులో ఉన్న పూలతో భగవంతుడికి పూలు సమర్పించండి. ఓం వినాయక నమః పుష్పాణి పూజయామి అని చెప్పుకుని పూజ చేయండి.

7.హారతి

కర్పూరం వెలిగించి గంట మ్రోగించి హారతి చూపించండి.

8.నైవేద్యం

మీకు నచ్చిన పండ్లు, స్వీట్లు వంటి నైవేద్యంగా పెట్టండి. మూడు సార్లు దేవుడికి చూపించండి.

ఈ తప్పులు చేయకండి:

  • పూజ చేసేటప్పుడు శుభ్రత పాటించాలి.
  • శ్రద్ధతో పూజ చేయాలి.
  • హడావిడిగా, మొక్కుబడిగా పూజ చేయకండి.
  • వాడిపోయిన పూలను దేవుడికి సమర్పించకండి.
  • భక్తితో పూజ చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.

పూజ చేయడానికి సరైన సమయం ఏది?

సాధారణంగా బ్రాహ్మ ముహూర్తంలో పూజకు శ్రేష్టమైనది. వీలు కాని వారు ఉదయం 8 గంటలలోపు లేదా సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవచ్చు.

నైవేద్యంగా ఏం పెట్టాలి?

అత్యంత ఖరీదైనవి పెట్టాల్సిన అవసరం లేదు. భక్తితో పాలు, బెల్లం లేదా అరటిపండునైనా సమర్పిస్తారు.

దీపారాధనకు ఏ నూనె వాడాలి?

ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపారాధనకు అత్యంత శుభప్రదమైనది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks