Evil Eye Remedies: దిష్టి తగలడం అంటే ఏమిటి? సులభమైన పరిహారాలు, శక్తివంతమైన మంత్రాలివే!

చిన్న పిల్లలు అకారణంగా ఏడవడం, ఇంట్లో పనులు వరుసగా ఆగిపోవడం, ఆకస్మిక అనారోగ్యం వంటి సందర్భాల్లో పెద్దలు దిష్టి తగిలిందని నమ్ముతారు. దీనిని తొలగించేందుకు ఉప్పు, ఆవాలు, ఎండుమిర్చితో పాటు భక్తితో మంత్రాలు జపించే సంప్రదాయం ఉంది.

Published on: Jul 4, 2026, 09:30:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిన్న పిల్లలు అకారణంగా ఏడుస్తున్నా, ఇంట్లో పనులు వరుసగా ఆగిపోతున్నా, లేదా ఎవరైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనా.. పెద్దలు వెంటనే "దిష్టి తగిలింది" అంటుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకం. దిష్టిని తొలగించడానికి ఉప్పు, ఆవాలు, ఎండుమిర్చి వాడటం మన సంప్రదాయం. అయితే, దిష్టి తీసేటప్పుడు ఏ మంత్రాలు చదవాలి? సరైన పద్ధతి ఏమిటి? అనే విషయాలపై చాలామందికి స్పష్టత ఉండదు.

Evil Eye Remedies: దిష్టి తగలడం అంటే ఏమిటి? సులభమైన పరిహారాలు, శక్తివంతమైన మంత్రాలివే! (pinterest)
Evil Eye Remedies: దిష్టి తగలడం అంటే ఏమిటి? సులభమైన పరిహారాలు, శక్తివంతమైన మంత్రాలివే! (pinterest)

దిష్టి తీసేటప్పుడు చదవాల్సిన శక్తివంతమైన మంత్రాలు

దిష్టి తీసేటప్పుడు మనసులో భక్తి, నమ్మకం ఉంటే ఫలితం త్వరగా ఉంటుందని పెద్దల మాట. ఆ సమయంలో ఈ కింది మంత్రాలను చదవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి:

హనుమంతుని మంత్రం: అంజనీ పుత్రుడైన హనుమంతుడిని స్మరిస్తే భయం, దిష్టి దోషాలు పటాపంచలవుతాయి. "ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్" అనే మంత్రాన్ని జపించండి. ఒకవేళ ఇది కష్టమనిపిస్తే, "సంకట కటె మిటె సబ పీరా, జో సుమిరై హనుమత బలబీరా" అనే హనుమాన్ చాలీసాలోని చౌపాయిని పఠించండి. ఇది మనశ్శాంతిని, రక్షణను ఇస్తుంది.

శివ పంచాక్షరి: సర్వశక్తిమంతుడైన పరమశివుడిని తలచుకోవడం అత్యంత శుభప్రదం. దిష్టి తీసేటప్పుడు నిశ్శబ్దంగా "ఓం నమః శివాయ" అని జపిస్తే చాలు, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మాయమై పాజిటివ్ తరంగాలు వ్యాపిస్తాయి.

దిష్టి తీసే విధానం: పాటించాల్సిన పద్ధతులు

ఒక గుప్పెడు ఆవాలు, కొద్దిగా కల్లుప్పు, రెండు మూడు ఎండుమిర్చిని చేతిలోకి తీసుకోండి. దిష్టి తగిలిన వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి, పై మంత్రాలను చదువుతూ తల నుండి పాదాల వరకు ఏడుసార్లు 'క్లాక్ వైజ్' (సవ్యదిశలో) దిష్టి తీయాలి. ఇలా తీసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కర్పూరం పెట్టి కాల్చాలి. ఆ వచ్చిన బూడిదను ఇంటి బయట ఎవరూ తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో పారేయాలి. వీలైతే పారే నీటిలో కూడా కలపవచ్చు.

ముఖ్యమైన జాగ్రత్తలు

దిష్టి తీసే ప్రక్రియ కేవలం ఆచారమే కాదు, ఇది మన మానసిక విశ్వాసానికి సంబంధించినది. కాబట్టి ఈ కింది సూచనలు పాటించండి:

దిష్టి తీసే సమయంలో అనవసరమైన మాటలు మాట్లాడకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.

"అంతా మంచే జరుగుతుంది" అనే బలమైన సంకల్పంతో ఈ పని చేయండి.

అతిగా నమ్మకం పెట్టుకున్నా, ఏదైనా తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించడం లేదా తగిన ప్రాక్టికల్ పరిష్కారాలను వెతకడం కూడా అంతే ముఖ్యం.

నిరాకరణ- ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More