ఆర్థిక ఇబ్బందులు తొలగాలని కోరుకుంటున్నారా? శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేయండి!

హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 

Published on: Oct 30, 2026, 12:30:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తాము. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడంతో పాటు, చాలామంది వివిధ పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగాలని కోరుకుంటున్నారా? శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేయండి! (AI)
ఆర్థిక ఇబ్బందులు తొలగాలని కోరుకుంటున్నారా? శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేయండి! (AI)

హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే, శుక్రవారం అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి పూజకు అత్యంత పవిత్రమైన రోజు. శుక్రవారం నాడు అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఉంటే దరిద్రం తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని నమ్ముతారు. శుక్రవారం సాయంత్రం పూట లక్ష్మీ పూజ చాలా విశేషమైనది. ఐదు గవ్వలతో చేసే ఈ పరిహారాన్ని పాటిస్తే చాలా విధాలుగా లాభాలను పొందవచ్చు.

శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ పూజను ఇలా చేయండి

శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆవు పాలు, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకోండి.

పూజ మందిరంలో ఒక పీఠంపై వస్త్రం పరిచి, ఐదు పసుపు రంగు గవ్వలను ఉంచండి. తర్వాత ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి, అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి లేదా గులాబీ రంగులో ఉండే పూలను సమర్పించండి. పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించి, దీపధూప నైవేద్యాలతో ఇలా అమ్మవారిని ఆరాధించండి. లక్ష్మీదేవిని స్మరిస్తూ పూజ చేయడం వలన సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. మహాలక్ష్మీ అష్టకాన్ని చదువుకోండి. ఈ అష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తిగా పఠించండి.

ఒకవేళ అష్టకాన్ని చదవలేకపోతే, ఓం మహాలక్ష్మ్యై నమః అనే మూలమంత్రాన్ని భక్తితో 108 సార్లు పఠించండి. అన్ని సార్లు కుదరకపోతే 11 సార్లు అయినా భక్తితో ఈ మంత్రాన్ని పఠించండి. కేవలం ఒక శుక్రవారం మాత్రమే కాకుండా, కుదిరితే 5 లేదా 11 శుక్రవారాల పాటు ఈ విధంగా పూజ చేయొచ్చు.

పూజ ముగిసిన తర్వాత ఆ గవ్వలను శుభ్రమైన వస్త్రంలో చుట్టి, డబ్బులు దాచుకునే చోట పెట్టండి. ఇక అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలకు లోటు ఉండదు. అయితే, భక్తితో పాటు కష్టపడడం కూడా చాలా ముఖ్యమైనది. సరైన ఆర్థిక ప్రణాళిక, పొదుపు సూత్రాలను పాటిస్తూ ఉంటే జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది.

లక్ష్మీదేవి శ్లోకాలు

1. లక్ష్మీ ధ్యాన శ్లోకం

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

2. లక్ష్మీ శ్లోకం

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

3. లక్ష్మీ శ్లోకం

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే

4. లక్ష్మీ గాయత్రీ మంత్రం

ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More