రాబోయే 2026 సంవత్సరం ద్వితీయార్థం (రెండవ భాగం) చాలా మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అంచనాల ప్రకారం.. 2026 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య సంభవించే గ్రహాల మార్పులు కొన్ని రాశిచక్రాల వారికి అద్భుతమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ఐదు నెలల కాలంలో కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి ఈ సమయం ప్రత్యేక ప్రయోజనాలను చేకూర్చనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
1. మిథున రాశి : నిలిచిన పనులు పూర్తి
- సంవత్సరంలో చివరి ఐదు నెలలు మిథున రాశి వారికి పెద్ద ఉపశమనాన్ని ఇస్తాయి.
- చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి.
- ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు… ఆశించిన ప్రదేశాల నుండి ప్రమోషన్లు లేదా మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, వ్యాపారం విస్తరిస్తుంది.
- ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది…. అయితే చిక్కుకుపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది.
2. కన్యా రాశి : కష్టానికి తగిన ప్రతిఫలం
- కన్యా రాశి వారికి ఈ కాలం కష్టపడి పనిచేయడానికి, దానికి తగిన ఫలితాలను అందుకోవడానికి సరైన సమయం.
- మీరు ఎంతో కాలంగా శ్రమిస్తున్న పనిలో చివరకు శుభవార్త వింటారు.
- ఆఫీసులో మీ కష్టానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొందరికి కొత్త బాధ్యతలు దక్కవచ్చు.
- వ్యాపారంలో లాభాలు క్రమక్రమంగా పెరుగుతాయి.
- కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది మరియు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం.
3. మకర రాశి : ఆదాయానికి కొత్త మార్గాలు
- ఆగస్టు - డిసెంబర్ మధ్య కాలం మకర రాశి వారికి సరికొత్త అవకాశాల గని అని చెప్పవచ్చు.
- కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి వారు కోరుకున్న కంపెనీల నుండి ఆఫర్లు లభిస్తాయి.
- పని పరిధి పెరగడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి.
- కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలం.
- కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, సంతోషం వెల్లివిరుస్తుంది.
4. మీన రాశి : ఆర్థిక బలం.. బంధాల బంధుత్వం
- 2026 చివరి ఐదు నెలలు మీన రాశి వారికి కెరీర్ పరంగా దూసుకుపోయే అవకాశాన్ని ఇస్తాయి.
- కష్టానికి తగిన గుర్తింపు లభించి, ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి.
- ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి.
- కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి సమయం దొరుకుతుంది, బంధాల మధ్య ఆప్యాయత పెరుగుతుంది.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}