ఈ నెలలో మహాలక్ష్మి రాజయోగం.. మిథునం నుంచి మకరం వరకు ఈ రాశుల వారికి శుభవార్తలు!
గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయని నమ్మకం. జూలై రెండో వారంలో గురుడు, చంద్రుడి కలయికతో ఏర్పడనున్న మహాలక్ష్మి రాజయోగం అత్యంత శుభప్రదమైన యోగంగా భావిస్తున్నారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు కారణంగా కొన్ని సార్లు శుభ యోగాలు ఏర్పడితే, కొన్ని సార్లు అశుభయోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకోసారి శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడడం చూస్తూ ఉంటాం.

అలాంటి శక్తివంతమైన యోగం ఒకటి జూలై నెలలో రాబోతోంది. జూలై రెండవ వారంలో అత్యంత శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం విశేషం. ఈ రాజయోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. గురువు, చంద్రుని కలయిక కారణంగా ఈ యోగం ఏర్పడి నాలుగు రాశుల వారి అదృష్టాన్ని విపరీతంగా పెంచబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో, ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
మహాలక్ష్మి రాజయోగంతో ఈ రాశుల వారికి ఫుల్లుగా లాభాలు.. ఇకపై డబ్బే డబ్బు!
1.మిథున రాశి
మిథున రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందబోతున్నారు. అదృష్టం కూడా ఈ సమయంలో పెరుగుతుంది. కుజగ్రహ ప్రభావంతో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా విజయాలు లభిస్తాయి. రాజకీయ, మీడియా రంగాల వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. పడిన కష్టానికి గుర్తింపు వస్తుంది. లక్ష్మీదేవి, కుబేరుని అనుగ్రహంతో కొత్త ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. విపరీతంగా కలిసి వస్తుంది.
2.ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కూడా ఈ రాజయోగం అద్భుతంగా ఉండబోతోంది. మహాలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారు విపరీతమైన శుభ ఫలితాలను పొందుతారు. పనిలో గుర్తింపు లభిస్తుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. ఆస్తులు కూడా మీ చేతికి వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
3.మేష రాశి
మేష రాశి వారికి ఊహించని లాభాలు ఉంటాయి. అపారమైన ప్రయోజనాలను పొందుతారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి మంచి భాగస్వామి దొరికే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.
4.మకర రాశి
మకర రాశి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మహాలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కూడా భారీగా లాభాలను పొందుతారు. పని చేసే చోట ప్రశంసలు వస్తాయి. ప్రమోషన్లు కూడా ఈ రాశి వారికి బాగా వచ్చే అవకాశం ఉంది.
మొత్తం మీద, ఈ నెలలో ఈ నాలుగు రాశుల వారు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంది. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్కసారిగా జీవితంలో అనుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


