శుక్రవారం ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించండి.. సంపద, సుఖ సంతోషాల కోసం ఈ మంత్రాలు చదవండి!

హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి, ప్రధాన ద్వారం వద్ద ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలతో అలంకరించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 

Published on: Nov 27, 2026, 07:00:35 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తులతో ఆరాధిస్తాము. హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని, దీపాలను వెలిగించి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. లక్ష్మీదేవి సంపద, సుఖసంతోషాలు, కుటుంబ శ్రేయస్సుకు కారకురాలు. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపదకు లోటు ఉండకుండా, దరిద్రం తొలగిపోయి సంపద రెట్టింపు అవుతుందని విశ్వసిస్తారు.

శుక్రవారం ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించండి.. సంపద, సుఖ సంతోషాల కోసం ఈ మంత్రాలు చదవండి! (AI)
శుక్రవారం ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించండి.. సంపద, సుఖ సంతోషాల కోసం ఈ మంత్రాలు చదవండి! (AI)

శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి?

మొదట ఇంటిని శుభ్రం చేయండి: శుక్రవారం ఉదయం ఇంటిని, పూజా మందిరాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ప్రధాన ద్వారం దగ్గర ముగ్గులు వేసి, కుదిరితే పసుపు, కుంకుమలతో అలంకరించండి.

దీపారాధన: శుభ్రంగా స్నానం చేశాక, ఉతికిన బట్టలు కట్టుకొని పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే అమ్మవారికి పువ్వులు, పసుపు, కుంకుమ సమర్పించండి.

సంకల్పం చెప్పుకోండి: కుటుంబ శ్రేయస్సు కలగడానికి, ఐశ్వర్యం, ఆరోగ్యం పొందడానికి, మనశ్శాంతి కలగడానికి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పుకోండి.

ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం, లక్ష్మీ గాయత్రి మంత్రం వంటివి కూడా చదువుకోవచ్చు.

లక్ష్మీ బీజ మంత్రమైనటువంటి ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించండి.

అమ్మవారికి పండ్లు లేదా పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించండి. చివరిగా హారతి ఇచ్చి, క్షమాప్రార్థన చెప్పుకోండి.

మహాలక్ష్మి అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి

సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని

మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి

యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే

మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే..

మహాలక్షీ శ్లోకాలు

1. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే..

2. ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే

3. విష్ణుపత్న్యై చ ధీమహి

తన్నో లక్ష్మీ ప్రచోదయాత్..

4. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ..

5. ఓం శుం శుక్రాయ నమః

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు