పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు
ఏడు శనివారాల వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం పూజా విధానం, నియమాలు ఇవే!
శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని, శని దోషాల నుంచి ఉపశమనం లభించాలని చాలామంది భక్తులు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారు. ఎంతో విశిష్టమైనదిగా భావించే ఈ వ్రతాన్ని వరుసగా ఏడు శనివారాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.
చాలామంది ఎంతో శక్తివంతమైన ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారు. ఏడు శనివారాల వ్రతం చేయడం వలన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని, శని దోష నివారణ కోసం చాలామంది భక్తులు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తారు.

అయితే ఈ వ్రతాన్ని ఏ రోజు ప్రారంభించాలి? ప్రారంభించడానికి మంచి రోజులు ఏవి? కావాల్సిన పూజా సామాగ్రి వివరాలతో పాటుగా పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించడానికి ఏ రోజు మంచిది?
ఈ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం లేదా ఏడు శనివారాల వ్రతం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. శని దోష బాధల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అయితే ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి లేదా మాస శివరాత్రి అనుకూలంగా ఉంటాయి. అలాగే అమావాస్య లేదా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, శ్రవణ నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించచ్చు. ఈ వ్రతాన్ని ఈ రోజుల్లో ప్రారంభించడం వలన మంచి ఫలితం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం చాలా ఉత్తమమైనది.
ఏడు శనివారాల వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు
- 7 శనివారాల వ్రతం కోసం లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు లేదా విగ్రహాలు కావాలి.
- పసుపు, కుంకుమలు, అక్షింతలు, పండ్లు, పూలు, రాగి చెంబు, పసుపు రంగు జాకెట్ ముక్క, కొబ్బరికాయ, నూనె, ఏడు వత్తుల దీపాలు, అగరవత్తులు, సాంబ్రాణి తీసుకోవాలి.
- నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించడానికి తయారు చేసుకోవాలి. అలాగే సాయంత్రం శనగపిండితో చేసిన లడ్డూలను నివేదన చేస్తారు. 7 లడ్డూలను తయారు చేసి సిద్ధం చేసుకోవాలి.
ఏడు శనివారాలు వ్రతం పూజా విధానం
ఈ విశేషమైన వ్రతం చేసుకోవాలంటే ఉదయం 6 నుంచి 7 గంటల వరకు లేదా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అనువైన సమయంగా చెప్పవచ్చు.
తూర్పు లేదా ఈశాన్యం వైపు పీట వేసి, పసుపు రాసి, ముగ్గు వేసి, పసుపు వస్త్రాన్ని పరిచి, బియ్యం పోసి, రాగి చెంబుతో కలశాన్ని ఏర్పాటు చేయాలి. కొబ్బరికాయను కూడా పెట్టాలి.
స్వామివారి పాదాల వద్ద ముడుపు పెట్టాలి. ముడుపు కట్టడం కోసం 11 రూపాయలు, పోక చెక్క, మూడు లేదా ఐదు ఎండు ఖర్జూరాలు ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి స్వామివారి దగ్గర పెట్టాలి.
పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవింద నామాలు, అష్టోత్తరం వంటివి చదువుకోవాలి. పూజ మొత్తం పూర్తయ్యాక అతిథికి భోజనాన్ని పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి.
ఏడు శనివారాల వ్రతం ఆచరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు
ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నియమాలను కూడా అనుసరించాలి. అవి కూడా చూద్దాం.
ఏడు శనివారాలు వ్రతం అంతా అయ్యాక తిరుపతిలో స్వామివారికి ముడుపును సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. వ్రతం అంతా అయిపోయిన తర్వాత, ఏడు శనివారాలు పూర్తయ్యాక దీనిని సమర్పించవచ్చు.
ఈ వ్రతం పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ నియమాలను కూడా అనుసరిస్తే మంచిది.
ఉదయం నిద్రపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం వంటి పొరపాట్లు చేయొద్దు.
పూజ చేసేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించేటట్టు చూసుకోవడం చాలా ముఖ్యం.
ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు తులసి మాలను కచ్చితంగా ధరించండి.
శనివారం తెల్లవారుజామున తలస్నానం చేయాలి. ఆ తర్వాత పూజా మండపాన్ని సిద్ధం చేసుకుని పూజ చేసుకోవాలి.
పురుషులు ఏడు శనివారాలు క్షవరం చేయించుకోవడం మంచిది కాదు. అలాగే గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటి పొరపాట్లు చేయకూడదు.
నుదుటిన తిరునామాన్ని ధరించాలి. ఇలా ఈ నియమాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఏడు శనివారాల వ్రతాన్ని నియమాలతో ఆచరించడం వలన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది.

E-Paper
