...
...
Next Story

గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు మరణానికి ముందు ఈ 6 రహస్య సంకేతాలను పంపిస్తాడు, నీడ కూడా వదిలేస్తుంది!

గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. ప్రతి ఒక్కరికీ పుట్టుక, చావు ఉంటాయి. అయితే చనిపోయే ముందు మాత్రం కొన్ని సంకేతాలను చూస్తారు. చనిపోయే ముందు ఒక వ్యక్తి ముందు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మరి చనిపోయే ముందు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సంకేతాలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jan 20, 2026, 16:30:05 IST
Advertisement

పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. అయితే మనకు ఉన్న 18 మహాపురాణాల్లో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గరుడ పురాణం ప్రకారం తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందట. గరుడ పురాణం పారాయణం చేస్తే ఆత్మకు శాంతి కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. గరుడ పురాణాన్ని విష్ణువు తన వాహనమైన గరుడుడికి చెప్పాడు. కనుక గరుడ పురాణం అనే పేరు వచ్చింది.

గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఈ సంకేతాలు కనపడతాయి (pinterest)
గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఈ సంకేతాలు కనపడతాయి (pinterest)

జీవిత సత్యాలను, మరణం తర్వాత రహస్యాలను తెలుసుకోవడానికి గరుడ పురాణాన్ని చదువుతారు. గరుడ పురాణాన్ని చదివేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించి, ఏకాగ్రతతో చదవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలి.

గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. ప్రతి ఒక్కరికీ పుట్టుక, చావు ఉంటాయి. అయితే చనిపోయే ముందు మాత్రం కొన్ని సంకేతాలను చూస్తారు. చనిపోయే ముందు ఒక వ్యక్తి ముందు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మరి చనిపోయే ముందు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సంకేతాలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఈ సంకేతాలు కనపడతాయి

  1. గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు వారి నీడను వారు చూసుకోలేరు. నీళ్లలో, నూనెలో లేదా అద్దంలో కూడా వారు తమ రిఫ్లెక్షన్‌ను చూసుకోవడానికి వీలు ఉండదు.
  2. అలాగే గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఆ వ్యక్తి చనిపోయిన పూర్వీకులను లేదా బంధువులను చూస్తారు.
  3. కలలో లేదా మెలకువగా ఉన్నప్పుడు చనిపోయిన వారు కనపడుతూ ఉంటారు. అలాగే చనిపోయే ముందు వారు సంతోషంగా వీరిని పిలుస్తున్నట్లుగా కూడా కనపడుతుంది.
  4. యమభటులు కూడా చనిపోయే ముందు కనపడతారు. యమభటులు పక్కన వారి నీడ ఉన్నట్లుగా కనపడుతుంది. దీంతో వారికి భయం లేదా కాస్త వింతగా అనిపిస్తుంది. నెగటివ్ ఎనర్జీ కూడా వారి చుట్టూ వ్యాపిస్తుంది.
  5. అలాగే చనిపోయే ముందు వారి జీవితమంతా ఒక సినిమా మాదిరిగా కనపడుతుంది. ఆ సమయంలో వారు జీవితంలో చేసిన మంచి, చెడును చూస్తారు. కొన్నిటి ద్వారా సంతృప్తి చెందితే, కొన్నిటి వల్ల బాధపడతారు.
  6. గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు చేతిపై ఉన్న గీతలు నెమ్మదిగా మాయమైపోతాయి. కొన్ని గీతలు అయితే పూర్తిగా కనిపించవు. ఇలా చనిపోయే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe