మూడు రోజుల పాటు ఐదు గ్రహాల కలయిక.. ఈ యోగంతో నాలుగు రాశులకు గోల్డెన్ డేస్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ మూడు రోజుల్లో ఐదు గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. నిన్నటి నుంచి మూడు రోజుల పాటు మకర రాశిలో ఐదు గ్రహాల కలయిక ఏర్పడింది. దీంతో కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరి జీవితాల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ మూడు రోజుల్లో ఐదు గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది.

నిన్నటి నుంచి మూడు రోజుల పాటు మకర రాశిలో ఐదు గ్రహాల కలయిక ఏర్పడింది. దీంతో కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశులకు శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశిలో పంచగ్రాహి యోగం:
సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇప్పటికే మకర రాశిలోకి ప్రవేశించారు. జనవరి 18, అనగా నిన్న చంద్రుడు కూడా ప్రవేశించాడు. దీంతో పంచగ్రాహి యోగం ఏర్పడింది. జనవరి 20, 21 తేదీల్లో కూడా ఈ యోగం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది.
మకర రాశిలో పంచగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు:
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సానుకూల మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా లాభాలను పొందుతారు. సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల కలయిక శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఊహించని విధంగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటికి చుట్టాలు వస్తారు. ప్రశాంతంగా, సరదాగా అనిపిస్తుంది.
తులా రాశి:
తులా రాశి వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభం ఉండొచ్చు.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ గ్రహాల కలయిక వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. కెరీర్‌లో కూడా ఊహించని మార్పులను చూస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


