కర్కాటక రాశిలో గురు సంచారం ఎందుకు ప్రత్యేకం? ఈ రాశులకు జూన్ ప్రారంభం నుంచి అద్భుతాలు, అదృష్టం,ఆనందం!

జూన్ 2, 2026న బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. గురు గ్రహం ఉచ్ఛ స్థితిలోకి రావడం వల్ల మేష, మిథున, తులా, కుంభ రాశుల వారికి అద్భుతమైన రాజయోగం పట్టనుంది. ఈ రాశుల వారికి ఈ గురు సంచారం అదృష్టాన్ని తెస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చదవండి. 

Published on: May 22, 2026, 11:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నింటిలోకి దేవగురువు బృహస్పతిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. జ్ఞానం, సంపద, వివాహం, సంతానం, అదృష్టం, పురోగతి వంటి ముఖ్యమైన అంశాలకు గురు గ్రహమే కారకుడు. అందుకే జాతక చక్రంలో గురు బలం ఉంటే ఏ పనైనా ఇట్టే పూర్తవుతుందని నమ్ముతారు. అటువంటి కీలకమైన గురువు తన రాశిని మార్చినప్పుడల్లా అన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు కనిపిస్తాయి.

కర్కాటక రాశిలో గురు సంచారం ఎందుకు ప్రత్యేకం? ఈ రాశులకు జూన్ ప్రారంభం నుంచి అద్భుతాలు, అదృష్టం,ఆనందం!
కర్కాటక రాశిలో గురు సంచారం ఎందుకు ప్రత్యేకం? ఈ రాశులకు జూన్ ప్రారంభం నుంచి అద్భుతాలు, అదృష్టం,ఆనందం!

తాజా జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 జూన్ 2వ తేదీన దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి గురు గ్రహానికి ఉచ్ఛ క్షేత్రం. అంటే ఈ రాశిలో ఉన్నప్పుడు గురువు తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తాడు. అత్యంత బలంగా ఉండి, శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ అద్భుతమైన మార్పు వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్, ధనం, కుటుంబ విషయాల్లో తిరుగులేని విజయాలు దక్కనున్నాయి.

ఈ రాశుల వారికి ఈ గురు సంచారం అదృష్టాన్ని తెస్తుంది

మేష రాశి:

మేష రాశి వారికి ఈ గురు సంచారం వల్ల ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. విలాసవంతమైన వస్తువులు, వాహనాలు లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారికి ఒత్తిడి తగ్గి, పనిలో గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మిథున రాశి:

ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. గతంలో ఎక్కడో ఆగిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాకుండా, పొదుపు చేసే అలవాటు కూడా బలపడుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

తులా రాశి:

తులా రాశి వారి కెరీర్‌లో ఊహించని పెద్ద మార్పులు రాబోతున్నాయి. మీ పనితీరును చూసి పై అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి ప్యాకేజీతో కూడిన కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపార రంగంలో ఉండేవారు కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇది సరైన సమయం. మీ తెలివితేటలు ఈ కాలంలో మీకు లాభాలను తెచ్చిపెడతాయి.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి గత కొంతకాలంగా ఉన్న కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. పట్టు వదలని విక్రమార్కుడిలా మీరు చేసే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత పెరగడం వల్ల కొత్త పనులు ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తారు. గురు గ్రహం ఇచ్చే ఈ వరం మీకు అన్ని విధాలా మేలు చేస్తుంది.

కర్కాటక రాశిలో గురు సంచారం ఎందుకు ప్రత్యేకం?

జ్యోతిష్య శాస్త్ర ప్రాథమిక సూత్రాల ప్రకారం.. కర్కాటక రాశి అనేది జల రాశి. చంద్రుడు దీనికి అధిపతి. గురు, చంద్రుల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉండటం వల్ల ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిని పొందుతాడు. ఈ సమయంలో గురువు ప్రభావం విద్య, వివాహం, ఆర్థిక పరిస్థితిపై సానుకూలంగా ఉంటుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మొత్తానికి, దేవగురువు బృహస్పతి ఉచ్ఛ రాశిలో సంచరించడం అనేది సమాజంలో ధార్మిక చింతనను పెంచడమే కాకుండా, వ్యక్తిగతంగా చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.

నిరాకరణ: (ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము.) మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి. )

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More