హిందూ ధర్మంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని మనం గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 29న అనగా ఈరోజు గురు పౌర్ణిమ పర్వదినం వచ్చింది.

మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. మనకు విద్యను, విచక్షణను, జీవిత సత్యాన్ని బోధించిన గురువులను స్మరించుకుని, కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన సందర్భం ఇది.
మహర్షి వేదవ్యాసుని జన్మదినం
పురాణాల ప్రకారం, ఈ పవిత్ర దినాన మహర్షి వేదవ్యాసుడు జన్మించారు. మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహాజ్ఞాని వేదవ్యాసుడు. అందుకే ఆ మహానుభావునికి గౌరవ సూచకంగా ఈ రోజును వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. మన జీవితానికి సరైన దారి చూపిన గురువుల పట్ల భక్తి, ప్రపత్తులను చాటుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి శిష్యులు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
చిరునవ్వులు పూయించే 10 అద్భుత సందేశాలు
ఈ గురు పౌర్ణిమ వేళ మీ ప్రియమైన వారికి, ఉపాధ్యాయులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా పంపదగిన ఉత్తమమైన పది శుభాకాంక్షల సందేశాలు ఇవి:
గురువు అంటే జ్ఞానపు ఖని.. అంతులేని కరుణా సముద్రం. అజ్ఞానపు చీకట్లు పారద్రోలి, తలపై చేయి వేసి నడిపించే గురువు ఉంటే సమస్త పాపాలు తొలగిపోతాయి. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు 2026!
సమయం కూడా నేర్పుతుంది, గురువు కూడా నేర్పుతారు. కాకపోతే రెండింటి మధ్య చిన్న తేడా ఉంది.. గురువు ముందుగా నేర్పించి పరీక్ష పెడతారు, కాలం మాత్రం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు!
మనసులో ఎనలేని గౌరవం ఉంచి, ఆయన చిన్న కోపంలోనూ అమూల్యమైన జ్ఞానం దాగి ఉంటుందని గ్రహించేలా తీర్చిదిద్దే మహనీయుడే గురువు. సమస్త లోకంలో గురువే అత్యంత గొప్పవారు.
శాంతి మార్గాన్ని చూపించి, అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, ద్వేషాన్ని జయించే విధానాన్ని నేర్పిన గురువుకు ప్రణామాలు.
కేవలం అక్షరజ్ఞానమే కాకుండా జీవిత సత్యాన్ని బోధించిన గురువు ఉపదేశాలను ఒంటబట్టించుకుంటే సంసారసాగరాన్ని అవలీలగా దాటవచ్చు.
దేవుడు, గురువు ఇద్దరూ ఎదురుగా నిలబడి ఉంటే ముందుగా ఎవరికి నమస్కరించాలి? జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకే ముందుగా నమస్కరిస్తాం.
మనిషి జీవితానికి దారి చూపే దిక్సూచి గురువే. జీవితమనే నావకు నిజమైన నావికుడు గురువే.
గురువు గొప్పతనాన్ని కీర్తిస్తూ శిష్యుడు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి గురువే.
గురువు లేకుండా జ్ఞానం కలగదు. గురువు లేకుండా సత్యం తెలియదు. గురువు లేకుండా దోషాలు తొలగవు.
ఏది సరైనది, ఏది తప్పు అని విడమర్చి చెప్పి, అడుగు ముందుకు పడని వేళ సరైన మార్గం చూపించేది గురువే.