గురు, శుక్ర, చంద్రుల అద్భుత కూటమి, ఆ రాశుల వారి జాతకం మారిపోయింది.. అపార ధనలాభం ఖాయం!
మిథున రాశిలో గురు, శుక్ర, చంద్ర గ్రహాల కలయికతో బలమైన 'త్రిగ్రాహి యోగం' ఏర్పడబోతోంది. మే 18 నుంచి 20 మధ్య ఈ అరుదైన కలయిక వల్ల మిథున, కన్య, తులా రాశుల వారికి అదృష్టం వరించనుంది. పూర్తి జాతక విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
గ్రహాలకు కదలికలు మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది. నవగ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇతర గ్రహాలతో కలిసినప్పుడు రకరకాల యోగాలు ఏర్పడడాన్ని చూస్తూ ఉంటాం.

ప్రస్తుతం దేవగురువు బృహస్పతి, గురువు శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఇద్దరు గురువులతో మనోకారకుడైన చంద్రుడు కూడా సంయోగం చెందబోతున్నాడు. ఒకే రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక శక్తివంతమైన త్రిగ్రాహి యోగాన్ని తీసుకొచ్చింది. మూడు రోజుల పాటు ఈ యోగం వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందబోతున్నారు.
మూడు రోజులు పాటు త్రిగ్రాహి యోగం
పంచాంగం ప్రకారం చూసినట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా మే 18, 19, 20 తేదీల్లో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఈ మూడు రోజులు కూడా మిథున రాశిలో గురు, శుక్ర, చంద్రుల కలయిక కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ యోగం చాలా పవిత్రమైనది, శుభప్రదమైనది, శక్తివంతమైనది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టడమే కాదు, ఆర్థికపరంగా కూడా లాభాలు కలగనున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
మూడు రోజులపాటు మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం... ఈ రాశులకు బోలెడు లాభాలు
1.కన్యా రాశి
కన్యా రాశి వారికి మూడు రోజుల పాటు శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఈ యోగంతో శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ మూడు రోజుల్లో మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఈ సమయంలో భారీగా లాభాలు కలగబోతున్నాయి. కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముఖ్యమైన పని ఈ సమయంలో చక్కగా పూర్తవుతుంది. సంతోషంగా ఉంటారు. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.
2.మిథున రాశి
ఈ మూడు గ్రహాల కలయిక వలన ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతోంది. దీంతో రాజభోగాలు అనుభవిస్తారు. సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొంతకాలంగా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు వస్తాయి. శుభవార్తలను వింటారు. రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి భూమికి సంబంధించిన సమస్యలు తొలగి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.
3.తులా రాశి
తులా రాశి వారికి ఈ యోగం వలన ధన లాభం కలుగుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలు పొందుతారు. ఈ సమయం ఈ రాశి వారికి లాభాల పంట పండుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. సీనియర్ అధికారుల సహకారం అందుతుంది. పనితీరుపై ప్రశంసలను పొందుతారు. శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు.
త్రిగ్రాహి యోగం సమయంలో ఏం చేస్తే మంచిది?
ఈ సమయంలో శివుడిని లేదా విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. గ్రహ స్థితులు అనుకూలంగా ఉంటే చేసే చిన్న ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. కాబట్టి ఈ రాశుల వారు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తే మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


