హనుమంతుని అనుగ్రహం ఉంటేనే ఆ సంకేతాలు.. మీలోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయా?
కలియుగ ప్రత్యక్ష దైవమైన హనుమంతుని కృపాకటాక్షాలు లభిస్తే భక్తులలో ఎలాంటి మానసిక మరియు ఆధ్యాత్మిక మార్పులు వస్తాయో తెలుసా? భయాలు తొలగిపోయి జీవితంలో సానుకూలత ఎలా పెరుగుతుందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
హిందూ సనాతన ధర్మంలో భగవంతుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే హనుమంతుని నామం స్మరిస్తే చాలు, మనిషిలో తెలియని శక్తి, అచంచలమైన భక్తి భావం కలుగుతాయి. శ్రీరాముని పరమ భక్తుడైన అంజనేయుడు అజరామరుడు, చిరంజీవి.

నేటికీ ఆయన సూక్ష్మ రూపంలో భూమిపై సంచరిస్తూనే ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి దేవదేవుని అనుగ్రహం ఒక వ్యక్తిపై ఉంటే, ఆ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి అద్భుతమైన విజయాలు, పురోగతి లభిస్తాయి. అయితే, హనుమంతుని ప్రత్యేక కృప ఒకరిపై ప్రసరిస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన మానసిక మరియు ఆధ్యాత్మిక సంకేతాలు అనుభవంలోకి వస్తాయి. ఆ సంకేతాలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.
కుదుటపడే మనసు
జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మనసు క్రమంగా స్థిమితపడటం హనుమంతుని అనుగ్రహానికి తొలి మెట్టుగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గందరగోళం, భయం కలిగించే వాతావరణంలోనూ ఎంతో ప్రశాంతంగా ఆలోచించే శక్తి సమకూరుతుంది. సమస్యలు పూర్తిగా మాయం కాకపోయినా, వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యం పెరుగుతుంది. హనుమను ప్రాణశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఆ దివ్య శక్తి ప్రభావం మనపై ఉన్నప్పుడు భయాలు స్వయంగా దూరమవుతాయి.
భావోద్వేగాల మీద పట్టు
మనసులోని భయం ఒక్కసారిగా మాయం కాకపోయినా, దాని తీవ్రత క్రమంగా క్షీణిస్తుంది. భవిష్యత్తు గురించి వచ్చే ఆందోళనలు, నష్టపోతామనే అభద్రతా భావాలు మనసును ఎక్కువగా ప్రభావితం చేయలేవు. "ఏది జరిగినా మంచికే, ఆ భగవంతుడు చూసుకుంటాడు" అనే ధైర్యం మనిషిలో బలపడుతుంది.
క్రమశిక్షణతో కూడిన దైనందిన జీవితం
అంజనేయ స్వామి కృప ఎవరిపై ఉంటుందో వారు సహజంగానే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలసట లేకుండా పాటిస్తారు. ఈ అంశంపై చాలామంది దృష్టి పెట్టరు కానీ ఇది ప్రధానమైన సంకేతం. బ్రహ్మచర్యం, ఆత్మ నియంత్రణ, అంతర్గత శుద్ధికి ప్రతీకగా ఆంజనేయుడిని కొలుస్తారు. ఆయన అనుగ్రహం లభించినప్పుడు శరీరం, మనసు ఒక చక్కని లయను సంతరించుకుంటాయి. నిద్రవేళలు మెరుగవుతాయి. గందరగోళం కంటే ప్రశాంతమైన, సాదాసీదా జీవితం వైపునకు మనసు ఆకర్షితులవుతుంది.
గట్టి నమ్మకం
చాలా మంది భక్తిని కేవలం ఒక తాత్కాలిక భావోద్వేగంగా భావిస్తారు. కానీ నిజమైన ఆధ్యాత్మికత అనేది మనసులోని లోతైన ప్రశాంతతను ఇస్తుంది. హనుమంతుని దయతో భయాలు తొలగిపోయినప్పుడు, ఆ భక్తి ఎంతో స్థిరంగా మారుతుంది. ఎంతటి దుర్భర పరిస్థితులు ఎదురైనా నిబ్బరం కోల్పోకుండా ఉండే మానసిక పరిపక్వత సొంతమవుతుంది. మనకు ఎవరో అదృశ్య శక్తి రక్షణగా ఉందనే గాఢమైన నమ్మకం మనిషిని ఎప్పుడూ కుంగనివ్వదు.
కష్టాల నుంచి అప్రయత్నంగా బయటపడటం
కొన్నిసార్లు మనం ఊహించని పెద్ద ప్రమాదాలు రావచ్చు. కానీ మనం ఎలాంటి నిర్ణయం తీసుకునే లోపే, ఆ సమస్య దానంతట అదే పరిష్కారమైపోతుంది. ఇలాంటి అనుభవాలు ఎదురైతే కచ్చితంగా మిమ్మల్ని ఆపద మొక్కులవాడైన ఆంజనేయ స్వామి కాపాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. మనిషి తన నమ్మకాన్ని కోల్పోయి, పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన క్షణాల్లో సైతం ఆయన ప్రత్యక్షమై రక్షణ కల్పిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


