...
...
Next Story

స్వర్గం, నరకం శాశ్వతం కాదు.. పురాణాల్లోని 14 లోకాల సీక్రెట్.. వీటికి మించిన మరో లోకం ఇది!

హిందూ పురాణాలలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. మనకు తెలిసి భూలోకం, స్వర్గం, నరకం అనుకుంటాం. కానీ 14 లోకాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన మరో లోకం ఉంది.

Published on: Jul 5, 2026, 18:02:32 IST
Advertisement

మనందరం స్వర్గం గురించి విని ఉంటాం. అక్కడ దేవతలు, అప్సరసలు ఉంటారని, దుఃఖాలు గానీ ఉండవని మనం నమ్ముతాం. మనం మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే హిందూ పురాణాల ప్రకారం, స్వర్గం మానవుని అంతిమ గమ్యం కాదు. వాస్తవానికి స్వర్గం కేవలం తాత్కాలికమైనది. మీ పుణ్యం పూర్తయిన వెంటనే.. మీరు భూమికి తిరిగి రావాలి. పురాణాలలో చెప్పిన చతుర్దశ భువనం.. అదే 14 లోకాల్లో చాలా విషయాలు ఉంటాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

హిందూ మతం ప్రకారం విశ్వంలో మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం నివసించే భూలోకాన్ని కేంద్రంగా చేసుకుని, భూమి కింద 7 లోకాలు (అధో లోకాలు), భూమి పైన 7 లోకాలు (ఊర్ధ్వ లోకాలు) ఉన్నాయి.

చాలా మంది భూమికి దిగువన ఉన్న లోకాలు నరకం అని పొరబడతారు. కానీ నరకం వేరు, ఈ దిగువ లోకాలు వేరు. పురాణాల ప్రకారం భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలను 'బిలవర్గం' అని పిలుస్తారు. అంటే స్వర్గం కంటే ఇక్కడ ఎక్కువ సంపద, ఆనందం, సుఖం ఉంటాయి.

అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ అనే ఏడు లోకాలు అద్భుతమైనవి. ఇవి భూమి కింద ఉంటాయి. ఉదాహరణకు బలి చక్రవర్తి నివసించే సుతల లోకంలో మహావిష్ణువు స్వయంగా ద్వారపాలకుడిగా కాపలా కాస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ లోకాల సౌందర్యం ఒక ఉచ్చు. ఇందులో చిక్కుకున్న వారు తమ సుఖంలో మునిగిపోయి వాస్తవాన్ని మరచిపోతారట.

భూమికి పైన ఉన్న లోకాలలో భూలోకము, భువర్లోకం, సువర్లోకం (స్వర్గం), మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం (బ్రహ్మలోకం) ఉన్నాయి. మనం అనుకునే స్వర్గం కేవలం ఒక బ్యాంకు అకౌంట్ లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగానే భూమిపై చేసిన పుణ్యాన్ని అక్కడ ఖర్చు చేయవచ్చు, కానీ కొత్త పుణ్యాన్ని సంపాదించలేమని పెద్దలు చెబుతుంటారు. పుణ్యం నిల్వ జీరో అయిన వెంటనే.. అక్కడి నుండి కిందికి పడిపోవాల్సి ఉంటుందట.

ఇక బ్రహ్మదేవుడు కొలువై ఉండే అత్యున్నతమైన సత్యలోకం కూడా శాశ్వతం కాదు. ప్రళయం సంభవించినప్పుడు.. అది కూడా నశించిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి శాశ్వతమైనది ఏమిటి? అని మీకు ఓ ప్రశ్న రావొచ్చు. అదే వైకుంఠం. వైకుంఠం ఈ 14 లోకాల పటానికి పూర్తిగా వెలుపల ఉంది. భక్తి మార్గాన్ని అనుసరించేవారు మాత్రమే వైకుంఠాన్ని చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన వారు ఎన్నటికీ తిరిగి రారు.

హిందూ పురాణాల ప్రకారం సాధారణంగా చెప్పే 14 లోకాలు కాకుండా వైకుంఠం అనే ప్రత్యేకమైన లోకం ఉంది. దీనిని పరమపదం అని కూడా పిలుస్తారు. 14 లోకాలు అనేవి సృష్టిలోని జనన, మరణ చక్రానికి లోబడి ఉంటాయి. కానీ వైకుంఠం మాత్రం ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండే దివ్యమైన, శాశ్వతమైన ఆధ్యాత్మిక లోకం.

ఈ లోకాలను అర్థం చేసుకోవడానికి మన ఆలయాలను కూడా పరిశీలిస్తే సరిపోతుంది. ఉదాహరణకు తమిళనాడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయానికి 7 ప్రాకారాలు ఉన్నాయి. ఈ ఏడు ప్రాకారాలు భూలోకం నుండి స్వర్గలోకం వరకు ఉన్న 7 ఉన్నత లోకాలకు ప్రతీకగా నిలుస్తాయి. అంటే మనం బయటి నుండి ఆలయం లోపలికి అడుగుపెట్టగానే, లోకాలను దాటుకుంటూ వెళ్తున్నామని అర్థం.

స్వర్గం అందమైనది.. కానీ అది శాశ్వతమైనది కాదు. ఏ లోకం కూడా శాశ్వతం కాదు. ఈ 14 లోకాలకు అతీతమైన వైకుంఠాన్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం భక్తి పెద్దలు చెబుతారు. ఆ భక్తి యాత్ర మనిషి నివసించే భూమి నుంచే మెుదలవుతుంది.

గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. పురాణాల్లో చెప్పిన విషయాన్ని అందించాం. కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe