ఈ సంవత్సరం మార్చి 4వ తేదీన హోలీ పండుగ వచ్చింది. హోలీ పండుగ నాడు రంగులతో అందరూ కలిసి సంతోషంగా హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే హోలీ నాడు రంగులతో ఆడుకునే ముందు మీకు ఏ కలర్ అదృష్టం తీసుకు వస్తుందో తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఏ రంగులు కలిసి వస్తాయి? జీవితంలో సానుకూల మార్పులు రావాలంటే ఏ రంగు మంచిదో తెలుసుకుందాం.
హోలీ నాడు ఏ రాశుల వారికి ఏ రంగు అదృష్టాన్ని తీసుకు వస్తుంది? మీ రాశికి ఏ రంగు కలిసొస్తుందో చూసుకున్నారా?
మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఎరుపు, గులాబీ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. పైగా ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్‌ను ఇస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. తెలుపు మరియు లైట్ పింక్ బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు మనశ్శాంతిని కలిగిస్తాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రంగుతో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు శుభఫలితాలను పొందాలంటే తెలుపు, వెండి రంగులు బాగా కలిసి వస్తాయి. శుభఫలితాలను పొందుతారు.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు కాషాయం లేదా గోల్డ్ రంగుతో అదృష్టాన్ని పొందుతారు. దీంతో నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి
కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి హోలీ నాడు ఆకుపచ్చ, పసుపు రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. సానుకూల మార్పులను చూస్తారు.
తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు గులాబీ, తెలుపు, నీలం రంగులతో అదృష్టాన్ని పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు గులాబీ, తెలుపు, నీలం రంగులతో అదృష్టాన్ని పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఎరుపు లేదా మెరూన్ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారికి పసుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. సంపద పెరుగుతుంది. ఆనందం కూడా పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారికి నీలం, పర్పుల్ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. స్థిరత్వం ఉంటుంది. సక్సెస్‌ను అందుకుంటారు.
కుంభ రాశి
కుంభ రాశికి అధిపతి శని. ఈ రాశి వారు నీలం రంగుతో అదృష్టాన్ని పొందుతారు.
మీన రాశి
మీన రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు పసుపు, కాషాయ రంగులతో అదృష్టాన్ని పొందుతారు. అలాగే పురోగతి కూడా ఉంటుంది.