మీరు ఇష్టపడే రంగు ఆధారంగా మీరు ఎలాంటి వారో తెలుసుకోండి!
కొంతమంది ఇష్టాలు ఒకలా ఉంటే, కొంత మందివి వేరుగా ఉంటాయి. ఇష్టపడే రంగును బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ కలర్ అనేది ఉంటుంది. వాటి ప్రకారం వారి వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చు. మరి మీకు ఇష్టమైన ఆ రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి చూసేయండి.
ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఇష్టాలు ఒకలా ఉంటే, కొంత మందివి వేరుగా ఉంటాయి. ప్రతి మనిషి కూడా మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటారు. మనం న్యూమరాలజీ, రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, పేరుతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెప్పవచ్చు. అలాగే పేరులో ఉన్న మొదటి అక్షరం కూడా అనేక విషయాలను చెబుతుంది.

అంతేకాకుండా ఇష్టపడే రంగును బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ కలర్ అనేది ఉంటుంది. వాటి ప్రకారం వారి వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చు. మరి మీకు ఇష్టమైన ఆ రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇక్కడ ఆ వివరాలను పూర్తిగా చూసేయండి.
ప్రతి ఒక్కరికి కూడా ఇష్టపడే రంగు ఒకటి ఉంటుంది. చాలా మంది ఆ విషయంలో ఆ రంగును ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ రంగు బట్టలు ధరించడం, ఆ రంగు వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేస్తారు. అయితే ఇష్టపడే రంగును బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు రంగు:
మీ ఫేవరెట్ కలర్ ఎరుపు అయితే, జీవితాన్ని చాలా ఉత్సాహంతో గడుపుతూ ఉంటారు. అలాగే మీ మాటల్లో చురుకుదనం ఉంటుంది. ఎక్కడైనా సరే అందరి దృష్టి మీ వైపు మళ్లుతుంది. మీరు మీ కలలను నిజం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ భావాలను వ్యక్తీకరించడంలో మీరు ఎల్లప్పుడూ ముందుంటారు.
నీలం రంగు:
మీరు ఇష్టపడే రంగు నీలం అయితే, మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే బ్యాలెన్స్‌గా ఉంటారు. అవసరమైన వాటిపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీకు మంచి బంధం ఉంటుంది. జీవితంలో మీరు ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు.
గులాబీ రంగు:
మీరు గులాబీ రంగును ఇష్టపడతారా? అయితే మీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తారు. స్వతంత్ర ఆలోచనలతో ఉంటారు. అన్నిట్లో ముందుండడానికి ప్రయత్నిస్తారు.
ఆకుపచ్చ రంగు:
ఆకుపచ్చ రంగు ఇష్టమైనట్లయితే, మీరు స్వేచ్ఛను ఆనందిస్తారు. సాహసాలు అంటే కూడా మీకు ఎంతో ఇష్టం. సమాజంలో చురుకుగా ఉండడానికి ఇష్టపడతారు. వ్యాపారంలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది.
తెలుపు రంగు:
మీరు తెలుపు రంగును ఇష్టపడుతున్నట్లయితే, మీరు ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. జాలి, దయ ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ఇతరులకు కూడా ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు.
పసుపు రంగు:
మీరు పసుపు రంగును ఇష్టపడుతున్నట్లయితే, మీరు ఉల్లాసమైన వ్యక్తి. ఎప్పుడూ జీవితాన్ని ఆనందిస్తారు. కష్ట సమయంలో కూడా పాజిటివ్‌గా ఉంటారు. మీ చిరునవ్వు, శక్తి ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ ఆఫీస్‌లో కూడా అందరితో అభిమానంగా ఉంటారు.
నలుపు రంగు:
నలుపు రంగును ఇష్టపడేవారు స్వతంత్రంగా ఉంటారు. ఎల్లప్పుడూ రహస్యంగా ఉంటారు. గోప్యతను కాపాడుకుంటారు. సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. ఈ రంగును ఇష్టపడేవారు జీవిత నాటకాలకు ఎప్పుడూ దూరంగా ఉండడానికి చూస్తారు.
ఊదా రంగు:
ఈ రంగును ఇష్టపడే వారు ఎక్కువగా బాధ్యతాయుతంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సందేహాలతో ఉండిపోతారు. ఆఫీస్‌లో ఇతరుల మద్దతును పొందుతారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండడానికి చూస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


