ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్ళి తర్వాత మరింత ఆనందంగా ఉంటారు, అదృష్టం కూడా వరిస్తుంది!

చాలా మంది న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవుతారు. న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ప్రకారం రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. రాడిక్స్ సంఖ్యలను బట్టి వారి ఆలోచన విధానం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉందనేది కూడా చెప్పొచ్చు.

Published on: Dec 6, 2025, 08:00:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా ఒక మనిషి జీవితంలో జరిగే మార్పులు గురించి తెలుసుకోవడంతో పాటుగా వారి తీరు, ప్రవర్తన ఎలా ఉందనేది కూడా చెప్పొచ్చు. చాలా మంది న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవుతారు. న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ప్రకారం రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. రాడిక్స్ సంఖ్యలను బట్టి వారి ఆలోచన విధానం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉందనేది కూడా చెప్పొచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్ళి తర్వాత మరింత ఆనందంగా ఉంటారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్ళి తర్వాత మరింత ఆనందంగా ఉంటారు (pinterest)

సంతోషంగా ఉంటారు

ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత వీరి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతి సంఖ్యకు కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితం అద్భుతంగా సాగుతుంది. పైగా అదృష్టవంతులు.

పెళ్లి తర్వాత కొంతమంది జీవితం మారిపోతుంది. పెళ్లి తర్వాత అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఎలాంటి బాధలు రావు. నిజంగా జీవితం ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా! ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నిజంగా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఎల్లప్పుడూ సంతోషం వారితోనే ఉంటుంది. మరి వీరిలో మీరు ఉన్నారేమో చూడండి.

రాడిక సంఖ్య 7

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో జన్మించినట్లయితే వారి రాడిక సంఖ్య 7 అవుతుంది. 7 సంఖ్యకు అధిపతి కేతువు. ఈ తేదీల్లో పుట్టిన వారు మతపరమైన వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులను కూడా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. పెద్దగా మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారికి అందరితో కూర్చోవడం అంటే ఎక్కువ ఇష్టముండదు. క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. విద్య, ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతుంటారు. వీరి ఆలోచన విధానం కూడా ఇతరులతో పోల్చితే కొంచెం భిన్నంగానే ఉంటుంది.

ఆత్మవిశ్వాసం ఎక్కువ

పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం కూడా మారిపోతుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు.

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది

పెళ్లి తర్వాత ఈ తేదీల్లో పుట్టిన వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. జీవితంలో చక్కటి సానుకూల మార్పులు చూస్తారు. ఏ పని చేసినా విజయం వీరిదే. ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితంలో సరైన జీవిత భాగస్వామి వస్తే ఏ విధమైన లోటు ఉండదు. ఆనందంగా ఉంటారు. అదృష్టం కూడా పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More