November Born People: నవంబర్ నెలలో పుట్టిన వారిపై ఈ గ్రహాల అనుగ్రహం ఉంటుంది, ఎక్కువగా ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తారు!

పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు, వారి బలాలు, బలహీనతలు గురించి కూడా చాలా విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు అందరితో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా ఉంటాయి.

Published on: Nov 1, 2025, 15:00:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు, వారి బలాలు, బలహీనతలు గురించి కూడా చాలా విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు అందరితో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. విరాట్ కోహ్లీ, సానియా మీర్జా, ఐశ్వర్యరాయ్, కమలహాసన్ లాంటి ప్రముఖులు నవంబర్ నెలలో పుట్టారు.

నవంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? (pinterest)
నవంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? (pinterest)

ఒక్కో నెలకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన వారు కాస్త భిన్నంగా ఉంటారు. వారి లక్షణాలు అందరితో కంపేర్ చేసి చూస్తే కొంచెం విభిన్నంగా ఉంటాయి. మరి నవంబర్ నెలలో మీరు పుట్టారా? మీ వ్యక్తిత్వ తీరు ఎలా ఉంటుంది, బలాలు బలహీనతలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?

నవంబర్ నెలలో పుట్టిన వారిపై గురు గ్రహం అనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు సృజనాత్మకంగా ఉంటారు. ఎప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. వీళ్లు ఏ పని చేసినా అందులో వారు ప్రత్యేకంగా ఉండేటట్టు చూసుకుంటారు. అలాగే మనసు పెట్టి పని చేస్తారు. ప్రతి పనిలో విజయవంతులవుతారు, ఉత్తమ ఫలితాలను పొందుతారు.

కష్టపడి పని చేస్తారు

నవంబర్ నెలలో పుట్టిన వారు బాగా కష్టపడి పనిచేస్తారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే, దానిని పూర్తి చేసే వరకు నిద్రపోరు. దానిని కష్టపడి పూర్తి చేస్తారు. ఏ పని చేసినా కూడా అంకితభావంతో చేస్తారు. పనిలో ఆలస్యం చేయరు.

తెలివితేటలు ఎక్కువ

నవంబర్ నెలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువ. పైగా వీళ్లు చాలా అందంగా కనబపతారు. ఇతరులు చూసి అసూయ పడేలా ఉంటారు. నవంబర్ నెలలో పుట్టిన వారికి ప్రజాదారణ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు.

మోసం చేయరు

నవంబర్ నెలలో పుట్టిన వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. బంధానికి ఎక్కువ విలువనిస్తారు. మోసం చేయరు. పైగా ఇతరులు చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మరు. వారికి కళ్లతో చూస్తేనే నమ్ముతారు. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తారు.

ధైర్యంగా ఉంటారు

నవంబర్ నెలలో పుట్టిన వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వీరిపై కుజుడు, గురు గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అలా వ్యాపారాల్లో విజయాలను అందుకుంటారు. జీవితంలో డబ్బు కొరత ఉండదు.

కొత్త వ్యక్తులను నమ్మడానికి టైమ్ పడుతుంది

అంత త్వరగా అందర్నీ నమ్మరు. కొత్త వ్యక్తులను నమ్మడానికి మాత్రమే ఎక్కువ టైమ్ పడుతుంది. తెలివైన వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడతారు. నవంబర్ నెలలో పుట్టిన వారికి జాలి, దయ కూడా ఎక్కువే. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కూడా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More