ఈ సంవత్సరం రక్షా బంధన్ ఆగస్టు 28న వచ్చింది. ఇప్పటికే రకరకాల ఆకర్షణీయమైన రాఖీలు మార్కెట్లో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి రాశికి, రంగులకు విడదీయరాని సంబంధం ఉంది. మీ సోదరుడి రాశికి తగిన రంగు, సరైన డిజైన్ ఉన్న రాఖీని ఎంచుకుని కట్టడం వారి భవిష్యత్తుకు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. మీ సోదరుడి రాశికి ఏ రంగు, ఏ డిజైన్ రాఖీ అత్యంత అనువైనదో చూడండి. రాఖీ రంగులు మాత్రమే కాకుండా దాని డిజైన్లు కూడా చాలా ముఖ్యమైనవి. రుద్రాక్ష, ఓం, స్వస్తిక్ డిజైన్లు ఉన్న రాఖీలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.
మేషరాశి

ఈ రాశికి అధిపతి కుజుడు. అందువల్ల మేష రాశి సోదరుడికి ఎర్ర రంగు రాఖీ కట్టడం చాలా శుభప్రదం. ఇది వారి జీవితంలో ధైర్యం, బలం, ఉత్సాహాన్ని పెంచుతుంది.
వృషభ రాశి
ఈ రాశికి శుక్రుడు అధిపతి. వృషభ రాశి వారు తెలుపు, వెండి లేదా లేత నీలం రంగు రాఖీని కట్టుకోవడం శుభప్రదం. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది.
మిథునం
మిథున రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఈ రాశికి చెందిన సోదరుడికి ఆకుపచ్చ రంగు రాఖీ కట్టడం ఉత్తమం. ఇది తెలివితేటలు, శాంతి, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
కర్కాటక
ఈ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి, కర్కాటక రాశి వారు తెల్లని లేదా ముత్యాలు పొదిగిన రాఖీని కట్టుకోవడం ఉత్తమం. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు పసుపు, నారింజ లేదా బంగారు రంగు రాఖీని కట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది.
కన్యారాశి
ఈ రాశికి బుధుడు అధిపతి కాబట్టి కన్యారాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది వృత్తిలో విజయాన్ని అందిస్తుంది.
తులారాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి సోదరుడికి తెలుపు లేదా లేత గులాబీ రంగు రాఖీ కట్టడం శుభప్రదం. ఇది వారి బంధాన్ని మరింత మధురంగా చేస్తుంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి సోదరుడికి తెలుపు లేదా లేత గులాబీ రంగు రాఖీ కట్టడం శుభప్రదం. ఇది వారి బంధాన్ని మరింత మధురంగా చేస్తుంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}కుజ గ్రహం వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల వారికి ఎరుపు లేదా గులాబీ రంగు రాఖీ శుభప్రదం.
ధనుస్సు రాశి
గురు గ్రహ ప్రభావంతో జన్మించిన వారికి పసుపు లేదా చందనం రంగు రాఖీ కట్టడం శుభప్రదం. ఇది జ్ఞానం, అదృష్టం, విజయానికి మార్గం సుగమం చేస్తుంది.
మకర రాశి
మకర రాశికి శని అధిపతి. ఈ రాశిలో జన్మించిన వారు నీలి రంగు రాఖీ కట్టుకోవడం చాలా శుభప్రదం. ఇది పనిలో క్రమశిక్షణను కలుగజేస్తుంది.
కుంభరాశి
మకర రాశిలాగే కుంభ రాశికి కూడా శని అధిపతి. అందువల్ల ముదురు నీలం లేదా బూడిద రంగు రాఖీ కట్టడం వారికి అదృష్టాన్ని తెస్తుంది.
మీన రాశి
ఈ రాశికి గురు గ్రహం అధిపతి కాబట్టి, మీన రాశి సోదరుడికి పసుపు లేదా కుంకుమ రంగు రాఖీ కట్టడం చాలా శుభప్రదం.
గమనిక : ఇది నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఆర్టికల్ ఇచ్చాం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.