భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకూడదు!
శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కొన్నిటికి దూరంగా ఉండాలి. ఇలాంటి పనులు చేస్తే మంచిది కాదని అంటారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను పెట్టడం జరిగింది. భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకూడదు.
భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకూడదు. ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. భారతీయ సంప్రదాయం, శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కొన్నిటికి దూరంగా ఉండాలి.

ఇలాంటి పనులు చేస్తే మాత్రం మంచిది కాదని అంటారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను పెట్టడం జరిగింది. మరి శాస్త్రం ప్రకారం, పెద్దలు చెప్పిన దాని ప్రకారం భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త ఏ పొరపాట్లు చేయకూడదు?
- భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త గుండు చేయించుకోవడం మంచిది కాదు. అలాగే భర్త పొరపాటున కూడా సముద్ర స్నానాలకు వెళ్లడం వంటివి చేయకూడదు.
- భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇల్లు శంకుస్థాపన చేయడం, కొత్త ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టడం వంటివి చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కూడా తప్పే. అలాగే భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇంటి మరమ్మత్తులు చేయించుకోవడం కూడా మంచిది కాదు.
- భార్య గర్భిణీగా ఉన్న సమయంలో భర్త అంత్యక్రియలు వంటి వాటిలో పాల్గొనకూడదు. పాడె మోయడం, స్మశానానికి వెళ్లడం వంటి పనులు చేయకూడదు. ప్రేత కార్యాలకు దూరంగా ఉంటేనే మంచిది.
- భార్య గర్భిణీగా ఉన్న సమయంలో భర్త కొండలు ఎక్కడం, దూర ప్రదేశాలకు తీర్థయాత్రలకు వెళ్లడం వంటివి మానుకోవాలి. కావాలంటే వీటిని వాయిదా వేసుకుని, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వెళ్లడం మంచిది.
- ఉగ్రరూపంలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకోకూడదు.
- భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త పాములను చంపడం, ఇతర జీవులను హింసించడం లాంటి తప్పులు చేయకూడదు. ఇలా చేయడం వలన కూడా సమస్యలు వస్తాయని శాస్త్రం చెప్తోంది.
ఈ తప్పులు కూడా చెయ్యకుండా చూసుకోవాలి
కొన్ని మానసిక, కుటుంబపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. భార్యతో గొడవ పడడం, ఆమెను బాధ పెట్టడం, ఆమెను కష్టపెట్టడం, ఆమెను బాధపెట్టే మాటలు అనడం వంటివి చేయకూడదు.
గర్భిణీ స్త్రీని ఎప్పుడూ భర్త సంతోషంగా చూసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
అలాగే భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త భయం కలిగించే పనులు చేయకూడదు. గట్టిగా అరవడం, భయానక దృశ్యాలను చూపించడం వంటి తప్పులు చేయకూడదు.
భార్య గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి ఎక్కువ రోజులు దూర ప్రదేశాలకు వెళ్లడం కూడా మంచిది కాదు. ఆమెకు తోడుగా ఉండాలి. ఆమె ఆనందంగా ఉండేటట్టు చూసుకోవాలి. దగ్గరగా ఉండి సంతోషకరమైన మాటలు చెప్పడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


