2026లో ఈ రాశుల మహిళల భర్తలకు విపరీతమైన లక్కు, ఆనందాలు, విజయాలు!

కొత్త సంవత్సరం అద్భుతంగా సాగాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే, ఈ మూడు రాశుల అమ్మాయిలు మాత్రం ఎంతో అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వారి భర్తల జీవితాల్లో కూడా వెలుగులు రాబోతున్నాయి. ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు.

Published on: Jan 2, 2026, 08:00:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026లోకి అడుగుపెట్టాము. 2026లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అయితే, కొత్త సంవత్సరం కొన్ని రాశుల స్త్రీ భర్తలకు అదృష్టం విపరీతంగా కలగబోతోంది. ఈ రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారి జీవితంలో వెలుగులు రాబోతున్నాయి. కొన్ని రాశుల మహిళలకు 2026 చాలా అదృష్టంగా మారబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఆ అదృష్ట రాశులను పెళ్లి చేసుకున్న భర్తలకు ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో ఈ రాశుల మహిళల భర్తలకు విపరీతమైన లక్కు (pinterest)
2026లో ఈ రాశుల మహిళల భర్తలకు విపరీతమైన లక్కు (pinterest)

కొత్త సంవత్సరం అద్భుతంగా సాగాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే, ఈ మూడు రాశుల అమ్మాయిలు మాత్రం ఎంతో అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వారి భర్తల జీవితాల్లో కూడా వెలుగులు రాబోతున్నాయి. ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు

2026లో ఈ రాశుల అమ్మాయిలకు, వారి భర్తలకు విపరీతమైన అదృష్టం.. అనేక విధాలుగా లాభాలను ఇస్తుంది

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి 2026లో చూసినట్లయితే చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రాశి అమ్మాయిలు చాలా ఆనందంగా ఉంటారు. భావోద్వేగాలను చంద్రుడు ప్రభావితం చేస్తాడు. ఈ రాశి అమ్మాయిలు భావోద్వేగ పరంగా దృఢంగా ఉంటారు.

వారి భర్తలకు కూడా భావోద్వేగ పరంగా అండగా నిలబడతారు. అదృష్టం కూడా భర్తలకు పెరుగుతుంది. వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు, ఆనందంగా ఉంటారు.

2.కుంభ రాశి

కుంభ రాశి స్త్రీలు ఆధ్యాత్మిక లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. పైగా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. 2026లో ఈ రాశి అమ్మాయిలు భర్త కష్టసుఖాలకు అండగా ఉంటారు. భర్తలను ఆనందంగా ఉంచడానికి కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. కనుక కుంభ రాశి స్త్రీలను పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా అదృష్టవంతులని చెప్పచ్చు. ఈ ఏడాదిలో వీరికి బాగా కలిసి వస్తుంది. ఎక్కువ శాతం విజయాలే ఉంటాయి.

3.సింహ రాశి

సింహ రాశి అమ్మాయిలను వివాహం చేసుకున్న వారికి కూడా కొత్త సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. ఈ రాశిపై సూర్యుని ప్రభావం ఉంటుంది. పని శక్తిని, నాయకత్వ లక్షణాలను సూర్యుడు ప్రభావితం చేస్తాడు. కనుక ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటారు. విజయాలను అందుకుంటారు. అదృష్టం కూడా వరిస్తుంది. మంచి ఫలితాలను చూస్తారు. భార్యాభర్తలిద్దరూ కూడా ఆనందంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More