ఏప్రిల్ నెలలో 5 గ్రహాల సంచారంలో మార్పు.. ఈ రాశుల దశ తిరిగిపోతుంది.. కెరీర్ బాగుంటుంది, కొత్త ఉద్యోగం, డబ్బు ఇలా ఎన్నో
గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో, కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఏప్రిల్ నెలలో ముఖ్యంగా ఐదు గ్రహాల సంచారంలో పెద్ద మార్పు రాబోతోంది. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు ఏప్రిల్ నెలలో వాటి కదలికను మార్చబోతున్నాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో చూసినట్లయితే, కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఏప్రిల్ నెలలో ముఖ్యంగా ఐదు గ్రహాల సంచారంలో పెద్ద మార్పు రాబోతోంది.

కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు ఏప్రిల్ నెలలో వాటి కదలికను మార్చబోతున్నాయి. ప్రతి నెలా కూడా ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు జరుగుతాయి. అలాగే ఏప్రిల్ నెలలో కూడా కొన్ని ముఖ్య గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. అనేక సానుకూల మార్పులు ఉంటాయి.
ఈ ఐదు గ్రహాలు కూడా వాటి సంచారంలో మార్పు చేయబోతున్నాయి. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు మార్చి నెలలో పెద్ద మార్పు చేయబోతున్నాయి. వీటిలో కొన్ని గ్రహాలైతే నేరుగా సంచారం చేయబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి కెరీర్‌లో బాగా కలిసి రాబోతోంది. ఆర్థికపరంగా లాభాలు పొందబోతున్నారు. ఇప్పుడు ఆ అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందాం.
ఏప్రిల్ నెలలో ఐదు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఏప్రిల్ నెలలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. శుక్రుడు దయతో ఈ రాశి వారు వారి నిజమైన ప్రేమను కనుగొనవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
2.మిధున రాశి:
మిధున రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. కొన్ని ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అనేక లాభాలు కలుగుతాయి.
3.వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కూడా ఏప్రిల్ నెలలో బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


