గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశుల్లో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే, సూర్యుడు మూడు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, అధికారము మొదలైన వాటికి కారకుడు.
సూర్య సంచారం

ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సూర్యుని సంచారంలో మార్పు చోటు చేసుకోబోతుండటంతో కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? సూర్య సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సూర్య సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
ఫిబ్రవరి నెలలో మొదట సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఫిబ్రవరి 6వ తేదీన చోటుచేసుకుంటుంది. తర్వాత ఫిబ్రవరి 13న సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఫిబ్రవరి 19న శతభిష నక్షత్రంలో సూర్యుని సంచారం ఉంటుంది.
ఇలా ఒకే నెలలో మూడు సార్లు సూర్యుని సంచారంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. 12 రాశులపై ప్రభావం పడినా, కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఆ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.
మూడుసార్లు సూర్య సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.మేష రాశి
మేష రాశి వారికి మూడు సార్లు సూర్యుని మార్పు శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో మేష రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పనిలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఏ పని చేసినా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
2.సింహ రాశి
{{/usCountry}}మేష రాశి వారికి మూడు సార్లు సూర్యుని మార్పు శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో మేష రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పనిలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఏ పని చేసినా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
2.సింహ రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి సూర్య సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఇది మంచి సమయం. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రేయస్సు ఉంటుంది.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి సూర్య సంచారం అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో కూడా సానుకూల మార్పులను చూస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం.