ఫిబ్రవరిలో మూడు సార్లు సూర్య సంచారంలో మార్పు.. ఈ రాశులకు డబ్బు, ఉద్యోగాలు, విజయాలతో పాటు ఊహించని లాభాలెన్నో!
గ్రహాలకు రాజు సూర్యుడు. జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి నెలలో సూర్యుడు మూడు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, అధికారము మొదలైన వాటికి కారకుడు. సూర్య సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి?
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశుల్లో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే, సూర్యుడు మూడు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, అధికారము మొదలైన వాటికి కారకుడు.

సూర్య సంచారం
ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సూర్యుని సంచారంలో మార్పు చోటు చేసుకోబోతుండటంతో కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? సూర్య సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సూర్య సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
ఫిబ్రవరి నెలలో మొదట సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఫిబ్రవరి 6వ తేదీన చోటుచేసుకుంటుంది. తర్వాత ఫిబ్రవరి 13న సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఫిబ్రవరి 19న శతభిష నక్షత్రంలో సూర్యుని సంచారం ఉంటుంది.
ఇలా ఒకే నెలలో మూడు సార్లు సూర్యుని సంచారంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. 12 రాశులపై ప్రభావం పడినా, కొన్ని రాశుల వారు మాత్రం ప్రత్యేక లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఆ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.
మూడుసార్లు సూర్య సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.మేష రాశి
మేష రాశి వారికి మూడు సార్లు సూర్యుని మార్పు శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో మేష రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పనిలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఏ పని చేసినా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
2.సింహ రాశి
సింహ రాశి వారికి సూర్య సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఇది మంచి సమయం. వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రేయస్సు ఉంటుంది.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి సూర్య సంచారం అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో కూడా సానుకూల మార్పులను చూస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


