బీకేర్ఫుల్.. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ 5 రాశులకు కష్టాలు.. ఈ గ్రహాల కారణంగా ఆర్థిక నష్టాలు, కోపాలు, టెన్షన్లు ఇలా అనేకం
ఫిబ్రవరి 13, 2026న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోనే నీడ గ్రహమైన రాహువు కూడా ఉండటంతో, ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహణ యోగం కారణంగా కొన్ని రాశుల వారు 2026 ఫిబ్రవరిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఫిబ్రవరి 13, 2026న సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోనే నీడ గ్రహమైన రాహువు కూడా ఉండటంతో, ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది.

ఇది కొంత ప్రమాదకరమైన యోగంగా భావించబడుతుంది. ఈ గ్రహణ యోగం కారణంగా కొన్ని రాశుల వారు 2026 ఫిబ్రవరిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య, రాహువుల ప్రమాదకర సంయోగం, ఈ రాశుల వారికి ఆర్థిక నష్టంతో పాటు పలు సమస్యలు
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ గ్రహణ యోగం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి ఎక్కువవుతుంది. తోటి ఉద్యోగస్తులతో సమస్యలు వస్తాయి. పేరు ప్రతిష్ఠలకు భంగం కలగవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
2.మిథున రాశి
మిథున రాశి వారు ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. రాహువు, సూర్యుల కలయిక ఈ రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. రిలేషన్‌షిప్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పనిలో మొదట అడ్డంకులు ఎక్కువవుతాయి. మానసికంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి.
3.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
4.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్‌లో సమస్యలు రావచ్చు. ఇంట్లో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి కూడా ఈ సమయం సమస్యలతో కూడినదిగా ఉంటుంది. సూర్య, రాహువుల సంయోగం ఈ రాశి వారికి నష్టాలను తీసుకొస్తుంది. కోపం పెరుగుతుంది, ఇరిటేషన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


