జూలై 6న తొలి ఏకాదశి.. ఆ రోజు విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఈ ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకోండి!

ఈసారి తొలి ఏకాదశి జూలై 6న వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, జాగరణ చేయడం కూడా మంచిదే.

Published on: Jun 30, 2025, 15:00:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ప్రతి పండుగ వస్తుంది. తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? (pinterest)
తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? (pinterest)

తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ప్రతి నెలలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. తొలి ఏకాదశి నుంచి తెలుగు పండుగలు అన్నీ మొదలవుతాయి కనుక ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, జాగరణ చేయడం కూడా మంచిదే. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు.

తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ఈసారి తొలి ఏకాదశి జూలై 6న వచ్చింది. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రిస్తారు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేలుకొంటారు. విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు నిద్రిస్తారు.

ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలు అని అంటారు. తొలి ఏకాదశి నుండి చాతుర్మాసదీక్షను మొదలుపెడతారు.ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి నుండి దక్షిణం వైపుకు వాలుతున్నట్లు కనబడతాడు. ఆ తర్వాత సూర్యుడు దక్షిణం వైపుకు వెళ్ళినట్లు కనబడడం మనకు దక్షిణాయనాన్ని సూచిస్తుంది.

ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యమో తెలుసా?

  1. తొలి ఏకాదశి నాడు భక్తి, శ్రద్ధతో విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి.
  2. ఎంతో మహిమగల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది. అంతేకాకుండా 60 వేల ఏళ్ళు తపస్సు చేసిన పుణ్యం కూడా దక్కుతుంది.
  3. తొలి ఏకాదశి నాడు నుంచి విష్ణుమూర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి నాలుగు నెలలు సేవలు స్వీకరించి ఆయనను అనుగ్రహిస్తాడని పురాణకథలు చెబుతున్నాయి.
  4. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించడంతో పాటు చాలా మంది సత్యనారాయణవ్రతాన్ని కూడా చేసుకుంటారు. ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
  5. తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా లలితా సహస్రనామ పారాయణ చేయడం విశేష ఫలితాలను అందిస్తుంది.
  6. ఆ రోజు పేదలకు అన్నదానం, వస్త్రధానం లాంటివి చేస్తే విష్ణు అనుగ్రహాన్ని పొందుతూ సంతోషంగా ఉండవచ్చు.
  7. తొలి ఏకాదశి నాడు ఆవును ఆరాధిస్తే కూడా మంచి ఫలితం పొందవచ్చు.

పేలాల పిండిని ఎందుకు తినాలి?

ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఉపవాసం తర్వాత తినే ఆహారం సాత్వికంగా, సులభంగాజీర్ణమయ్యే విధంగా ఉండాలి. అందుకే పేలాల పిండిని తింటారు. పైగా పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టం. పేలాల పిండిని తినడం వలన పూర్వికులను స్మరించుకున్నట్లు అవుతుందని కూడా అంటారు. అంతేకాకుండా పేలాల పిండిని పితృదేవతల పేరు చెప్పి దానం కూడా ఇస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More