ఈ రాశుల వారికి జూన్ నెల జాక్‌పాట్.. మకర రాశిలో చంద్రుడి సంచారం, ఆర్థికంగా ఈ 3 రాశుల వారికి బంగారు రోజులు!
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: జూన్ 4న చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఈ చంద్ర సంచారం వల్ల మేషం, తుల, మీన రాశుల వారికి అదృష్టం వరించబోతోంది. వీరికి ఆర్థిక లాభాలతో పాటు కెరీర్‌లో భారీ పురోగతి లభిస్తుంది.
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు జూన్ 4న చంద్రుడు తన రాశిని మార్పు చేశాడు. చంద్రుడు తులా రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు.

ఈరోజు ఉదయం 7:42కి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడింది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు, ఆర్థికపరంగా బోలెడు మార్పులు
1.మేష రాశి
మేష రాశి వారికి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు. జీవితంలో అనుకున్న వాటిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు.
పురోగతి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. భారీగా లాభాలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఇది శుభ సమయం.
2.తులా రాశి
తులా రాశి వారికి మకర రాశిలో చంద్రుడు శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రశాంతత పెరుగుతుంది. తులా రాశి వారు ఈ సమయంలో జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
అలాగే తండ్రి నుంచి లేదా అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తుల నుంచి భారీగా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సమస్యలు తొలగిపోతాయి. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు.
3.మీన రాశి
మీన రాశి వారికి కూడా ఇది అనేక మార్పులను తీసుకొస్తుంది. చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. లాభాలను చూస్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పాత ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. మొత్తానికి చంద్ర సంచారంలో మార్పుతో విపరీతమైన లాభాలు కలుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


