పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు చెప్పచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక వ్యక్తి పుట్టిన నెల స్వభావం, ఆలోచన విధానం, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏడాదిలో ఉండే 12 నెలల్లో ఒక్కో నెలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది.

అయితే జూన్, జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఇతరులతో పోల్చుకుంటే ఈ నెలలో పుట్టిన వాళ్లు ఎలా విభిన్నంగా ఉంటారు? నిజానికి ఇతరులతో పోల్చుకుంటే ఎంతో భిన్నమైన మనస్తత్వంతో ఈ నెలలో పుట్టిన వాళ్లు ఉంటారు. అలాగే సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఇక ఈ నెలలో పుట్టిన వారి గుణగణాలు, కెరీర్, ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా చూసేద్దాం.
జూన్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
జూన్ నెలలో పుట్టిన వారు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరి నవ్వు కూడా ఎవరినైనా సులభంగా పడేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, జూన్ నెలలో పుట్టిన వారు మహా తెలివైన వారు. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా అందరి దృష్టిని మీరు ఇట్టే ఆకర్షించగలరు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని చూస్తూ ఉంటారు.
జూన్ నెలలో పుట్టిన వాళ్లకు స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. సినిమా, కళలు, రచన రంగాల్లో బాగా రాణించగలరు. కానీ త్వరగా మూడ్‌ను మార్చుకుంటారు. కోపం ఒక క్షణంలో వస్తే, మరో క్షణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ప్రేమ విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. భాగస్వామిని కూడా బాగా చూసుకుంటారు.
జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
జూలై నెలలో పుట్టిన వారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కఠినంగా, గంభీరంగా కనిపించినా మనసు మాత్రం వెన్నలా ఉంటుంది. ఇతరుల బాధలను కూడా త్వరగా అర్థం చేసుకుని, చేతనైన సాయం చేస్తారు. జూలైలో పుట్టిన వారికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరి దగ్గర కూడా గౌరవాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడరు.
{{/usCountry}}జూలై నెలలో పుట్టిన వారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కఠినంగా, గంభీరంగా కనిపించినా మనసు మాత్రం వెన్నలా ఉంటుంది. ఇతరుల బాధలను కూడా త్వరగా అర్థం చేసుకుని, చేతనైన సాయం చేస్తారు. జూలైలో పుట్టిన వారికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరి దగ్గర కూడా గౌరవాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడరు.
{{/usCountry}}ఈ నెలలో పుట్టిన వారు కుటుంబానికి, బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో కష్టపడి పైకి వస్తారు. వ్యాపారంలో కూడా బాగా విజయాలను అందుకుంటారు. డబ్బును పొదుపు చేయడం కూడా వీరికి బాగా తెలుసు. భవిష్యత్తు కోసం ఎప్పుడూ మంచి ప్లాన్లు వేసుకుంటారు. ప్రేమ, పెళ్లి విషయంలో కూడా సిన్సియర్‌గా ఉంటారు. అలాగే భాగస్వామికి తమ పూర్తి సపోర్ట్ ఇస్తారు. భాగస్వామి కోసం వారు చాలా కష్టపడతారు కూడా.
జూన్ vs జూలై
ఈ రెండు నెలల్లో పుట్టిన వారి మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే, జూన్ నెలలో పుట్టిన వారు అందరితో బాగా కలిసిపోతారు. జూలై నెలలో పుట్టిన వారు మాత్రం అంత ఈజీగా కలవలేరు. అలాగే జూన్ నెలలో పుట్టిన వారు మాటలతో మాయ చేస్తారు. జూలైలో పుట్టిన వారు చేతలతో, నమ్మకంతో ఇతరుల మనసును ఇట్టే గెలుచుకుంటారు.