జ్యోతిష్య శాస్త్రం లాగానే.. సంఖ్యాశాస్త్రం కూడా ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన సాధనంగా చూస్తారు. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా మూల సంఖ్యను లెక్కిస్తారు. 1 నుండి 9 వరకు ఉండే ఈ మూల సంఖ్యలు ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తు విధిని నిర్ణయిస్తాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. జూన్ నెల చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల స్థానాలు, సంఖ్యల కలయిక కొంతమందికి గొప్ప అదృష్టాన్ని తెస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో సంఖ్యల ప్రభావం చాలా ముఖ్యమైనది. జూన్ నెల కొన్ని మూల సంఖ్యలకు కొత్త ఆశను ఇస్తుంది.

జూన్ నెల ముఖ్యంగా మూడు ప్రధాన సంఖ్యలు గల వ్యక్తులకు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆర్థిక అభివృద్ధి, వృత్తిపరమైన పురోగతి, మానసిక ప్రశాంతత, కుటుంబ ఆనందాన్ని పొందుతారు. ఆ అదృష్టాన్నిచ్చే మూడు ప్రధాన సంఖ్యలు ఏమిటో ఇక్కడ పూర్తి సమాచారం ఉంది.
నెంబర్ 3
ఏ నెలలోనైనా 3వ, 12వ, 21వ లేదా 30వ తేదీన జన్మించినవారికి జూన్ నెల కలిసి వస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. 3 సంఖ్య గల వారికి జూన్ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు పొందడానికి స్పష్టమైన అవకాశాలు లభిస్తాయి. వారి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది లాభదాయకమైన సమయం, ఎందుకంటే వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు కొత్త పెట్టుబడులు పెడితే, భవిష్యత్తులో కచ్చితంగా మంచి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది.
నెంబర్ 5
ఏ నెలలోనైనా 5వ, 14వ లేదా 23వ తేదీన జన్మించినవారి సంఖ్య 5. వారికి జూన్ నెల ఊహించని ఆర్థిక లాభాలను తెస్తుంది. చాలా కాలంగా ఆలస్యమైన లేదా రావలసిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీ సృజనాత్మకత, తెలివితేటలతో మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. పెళ్లికాని వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల మీకు అన్ని వైపుల నుండి శుభవార్తలను తెస్తుంది.
నెంబర్ 7
ఏ నెలలోనైనా 7వ, 16వ లేదా 25వ తేదీన జన్మించినవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి జూన్ నెలలో అదృష్ట దేవత అనుగ్రహం లభిస్తుంది. మీరు మీ వృత్తిలో కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. కొత్త వాహనం లేదా ఆస్తి కొనాలన్న మీ చిరకాల స్వప్నం ఈ నెలలో నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఈ సమయం మంచిది.
{{/usCountry}}ఏ నెలలోనైనా 7వ, 16వ లేదా 25వ తేదీన జన్మించినవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి జూన్ నెలలో అదృష్ట దేవత అనుగ్రహం లభిస్తుంది. మీరు మీ వృత్తిలో కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. కొత్త వాహనం లేదా ఆస్తి కొనాలన్న మీ చిరకాల స్వప్నం ఈ నెలలో నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఈ సమయం మంచిది.
{{/usCountry}}