కర్కాటకంలోకి గురువు: జూన్ నుంచి ఈ 4 రాశుల వారికి 'గజకేసరి యోగం'.. ఇక తిరుగుండదు!
జూన్ నెలలో జరగబోయే గురు గ్రహ సంచారం పన్నెండు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులకు సంకేతంగా మారుతోంది. ముఖ్యంగా కర్కాటక రాశిలో చంద్రుడు, గురుడు కలయిక వల్ల ఏర్పడే 'గజకేసరి యోగం' కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఆర్థిక వృద్ధిని ప్రసాదించనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని (గురువు) జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న గురువు, జూన్ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శక్తిమంతమైన 'గజకేసరి యోగం' ఉద్భవిస్తుంది. ఏనుగు (గజం), సింహం (కేసరి) కలిస్తే ఎంతటి శక్తి వస్తుందో.. ఈ యోగం వల్ల జాతకులకు అంతటి ధైర్యం, రాజభోగాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కాబట్టి, ఈ ప్రభావం మరింత బలంగా ఉండనుంది.

లీడర్‌షిప్ నుంచి ఆర్థిక లాభాల వరకు
ఈ యోగం పట్టడం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. భావోద్వేగపరంగా మీరు మరింత దృఢంగా మారుతారు. కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. ఆర్థికంగా చూస్తే.. ఖర్చులు తగ్గుముఖం పట్టి, పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి.
ఈ నాలుగు రాశుల వారికి రాజయోగం
1.మేష రాశి: ఇల్లు, వాహన యోగం
మేష రాశి వారికి ఈ సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక స్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనుకునే వారి కల ఈ కాలంలో నెరవేరుతుంది.
2.వృషభ రాశి: పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి
వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ గజకేసరి యోగం మంచి సంబంధాలను తీసుకు వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
3.కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసమే మీ బలం
గురువు మీ రాశిలోనే సంచరిస్తుండటంతో అత్యధిక ప్రయోజనం మీకే లభిస్తుంది. ఆర్థికంగా లాభపడటమే కాకుండా, మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం మీ వరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.
4.మకర రాశి: వృత్తిలో పురోగతి
మకర రాశి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య సమతుల్యత సాధిస్తారు. కార్యాలయాల్లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్సెస్ అయి, భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


