...
...
Next Story

బృహస్పతి రాశి మార్పు : జూన్ 2 నుంచి ఈ రాశుల వారికి అదృష్ట యోగం - ఈ తేదీల్లో మాత్రం కొత్త పనులు వద్దు!

Jupiter transit 2026 : నవగ్రహాల్లో శుభగ్రహమైన బృహస్పతి జూన్ 2న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు వల్ల మిథున, కర్కాటక, ధనస్సు, మీన రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. అయితే జూలై-ఆగస్టు మధ్య కాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Published on: May 9, 2026, 10:27:32 IST
Advertisement

Jupiter transit 2026 : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన గ్రహంగా భావించే బృహస్పతి (గురువు) తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఒక రాశిలో సుమారు ఏడాది పాటు ఉండే గురువు….. ఈ ఏడాది 'అతిచారం' (వేగంగా రాశి మారడం) వల్ల తక్కువ సమయంలోనే మూడు రాశుల్లో సంచరించబోతున్నాడు.

బృహస్పతి రాశి మార్పు
బృహస్పతి రాశి మార్పు

ఈ ఏడాది జనవరిలో మిథున రాశిలోకి ప్రవేశించిన బృహస్పతి…. జూన్ 2వ తేదీన తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అనంతరం అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

గురువు తన స్వక్షేత్రం లేదా ఉచ్ఛ రాశిలో ఉన్నప్పుడు అత్యంత బలమైన ఫలితాలను ఇస్తాడు. కర్కాటక రాశిలో గురువు సంచారం వల్ల సమాజంలో ధర్మం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి. అయితే, మధ్యలో ఒక నెల రోజుల పాటు గురు గ్రహం తన శక్తిని కోల్పోయే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

జూలై 14 - ఆగస్టు 12: ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

ఈ ఏడాది జూలై 14 నుండి ఆగస్టు 12 వరకు గురువు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వస్తాడు. జ్యోతిష్య పరిభాషలో దీనిని 'గురు మౌఢ్యమి' లేదా 'గురువు అస్తమించడం' అంటారు. సూర్యుడి ప్రతాపం వల్ల గురువు తన సహజ సిద్ధమైన శుభ శక్తిని కోల్పోతాడు. ఈ సమయంలో శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి మాత్రమే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు…?

మిథున రాశి : జూన్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో అనూహ్య మార్పులు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

ధనస్సు రాశి : భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న విదేశీ ప్రయాణం లేదా విహారయాత్ర ఈ సమయంలో కార్యరూపం దాల్చుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీన రాశి : మీ రాశికి అధిపతి అయిన గురువు బలంగా ఉండటం వల్ల…. జూన్ నుండి మీ వృత్తి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు, సంతాన సంబంధిత ఆందోళనలు ఈ కాలంలో పరిష్కారమవుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభించే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe