ఒక్కోసారి గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం అంగారక యోగం పూర్తయింది. ఏప్రిల్ 2న శని, కుజ గ్రహాల సంయోగం ఏర్పడింది. మీన రాశిలో ఈ సంయోగం మే 11 వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంయోగం జ్వాలాముఖి యోగాన్ని తీసుకొచ్చింది. ఈ యోగం కారణంగా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. మరి రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడే జ్వాలాముఖి యోగంతో 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడింది? ఏ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశిలో శని, కుజ గ్రహాల సంయోగంతో జ్వాలాముఖి యోగం.. 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు:
మేష రాశి:

మేష రాశి వారికి 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇతరులతో వాదించకండి. ఎక్కువ గొడవల వలన సమస్యలు వస్తాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి జ్వాలాముఖి యోగం సంతోషాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి 11వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను జాగ్రత్తగా గమనించడం మంచిది.
మిధున రాశి:
మిధున రాశి వారికి 10వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఇది చిన్నపాటి సమస్యలను తీసుకొస్తుంది. పనిలో అడ్డంకులు ఏర్పడవచ్చు. సడన్‌గా ట్రాన్స్‌ఫర్లు వంటివి చూస్తారు. వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి 9వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం చూస్తారు. విజయాలను అందుకుంటారు. కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి:
సింహ రాశి వారికి 8వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఇది అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది. గొడవలు జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సమయంలో టెన్షన్లు పెరగవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో వ్యవహరించడం మంచిది. కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగితే మంచిది.
తులా రాశి:
{{/usCountry}}కన్యా రాశి వారికి ఈ సమయంలో టెన్షన్లు పెరగవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో వ్యవహరించడం మంచిది. కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగితే మంచిది.
తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి 6వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. అప్పులు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
ఈ యోగం కారణంగా వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా బాగుంటుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి 4వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సమస్యలు లేకుండా చూసుకోండి.
మకర రాశి:
మకర రాశి వారికి 3వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త షాప్ లేదా ఫ్యాక్టరీ వంటి వాటిని ప్రారంభించవచ్చు. అదృష్టంపై కాకుండా కష్టంపై నమ్మకం పెట్టుకోండి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి 2వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగ పరంగా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. అనవసరంగా డబ్బును వృథా చేయకండి.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ యోగం సాధారణ ఫలితాలను తీసుకొస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదంటే సమస్యలు రావచ్చు. జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.