జ్వాలాముఖి యోగం: మీన రాశిలో శని, కుజ గ్రహాల సంయోగం.. పన్నెండు రాశుల జీవితంలో అనేక మార్పులు!
జ్వాలాముఖి యోగం అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను చూడచ్చు. శని, కుజ గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడింది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. ఈ యోగం ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు ఉంటుంది. మరి ఈ యోగం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయో తెలుసుకోండి.
ఒక్కోసారి గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం అంగారక యోగం పూర్తయింది. ఏప్రిల్ 2న శని, కుజ గ్రహాల సంయోగం ఏర్పడింది. మీన రాశిలో ఈ సంయోగం మే 11 వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంయోగం జ్వాలాముఖి యోగాన్ని తీసుకొచ్చింది. ఈ యోగం కారణంగా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. మరి రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడే జ్వాలాముఖి యోగంతో 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడింది? ఏ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీనరాశిలో శని, కుజ గ్రహాల సంయోగంతో జ్వాలాముఖి యోగం.. 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు:
మేష రాశి:
మేష రాశి వారికి 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇతరులతో వాదించకండి. ఎక్కువ గొడవల వలన సమస్యలు వస్తాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి జ్వాలాముఖి యోగం సంతోషాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి 11వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను జాగ్రత్తగా గమనించడం మంచిది.
మిధున రాశి:
మిధున రాశి వారికి 10వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఇది చిన్నపాటి సమస్యలను తీసుకొస్తుంది. పనిలో అడ్డంకులు ఏర్పడవచ్చు. సడన్‌గా ట్రాన్స్‌ఫర్లు వంటివి చూస్తారు. వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి 9వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం చూస్తారు. విజయాలను అందుకుంటారు. కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి:
సింహ రాశి వారికి 8వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఇది అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది. గొడవలు జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సమయంలో టెన్షన్లు పెరగవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో వ్యవహరించడం మంచిది. కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగితే మంచిది.
తులా రాశి:
తులా రాశి వారికి 6వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. అప్పులు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
ఈ యోగం కారణంగా వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా బాగుంటుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి 4వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రశాంతంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సమస్యలు లేకుండా చూసుకోండి.
మకర రాశి:
మకర రాశి వారికి 3వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త షాప్ లేదా ఫ్యాక్టరీ వంటి వాటిని ప్రారంభించవచ్చు. అదృష్టంపై కాకుండా కష్టంపై నమ్మకం పెట్టుకోండి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి 2వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగ పరంగా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. అనవసరంగా డబ్బును వృథా చేయకండి.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ యోగం సాధారణ ఫలితాలను తీసుకొస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదంటే సమస్యలు రావచ్చు. జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


