కాల సర్ప యోగం అనేది చాలా ముఖ్యమైనది. అన్ని గ్రహాలు రాహువు, కేతువుల మధ్య ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇలాంటి అరుదైన యోగం మే 11న ఏర్పడబోతోంది. సింహ రాశిలో ఉన్న కేతువు, కుంభరాశిలో ఉన్న రాహువు మధ్య అన్ని గ్రహాలు ఆ రోజు ఉండడంతో ఈ కాలసర్పయోగం ఏర్పడింది. ఈ యోగం మే 26 వరకు ఉంటుంది.

ఈ సమయంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి కాలసర్పయోగం వలన ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి? ఎవరు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అరుదైన కాలసర్పయోగం... నాలుగు రాశుల వారికి ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండాలి
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ యోగం వలన ఇబ్బందులు వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రత్యర్థులు పనిలో చాలా ముందుంటారు. కాబట్టి మీరు ఏ పనినైనా జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఇది చాలెంజింగ్ టైమ్ అని చెప్పొచ్చు. రాహు, కేతువుల ప్రభావం వలన ఒత్తిడి పెరుగుతుంది. భయం కూడా పెరుగుతుంది. పని ప్రదేశంలో చికాకులు, సమస్యలు ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది. రిలేషన్‌షిప్ కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి.
3.కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఇది ఇబ్బందులను తీసుకువచ్చే సమయం. ఈ సమయంలో ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదర సమస్యలు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
4.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా ఇది ఇబ్బందులను తీసుకొచ్చే సమయం. కాలసర్ప యోగం వలన ఈ రాశి వారికి టెన్షన్లు పెరిగిపోతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కొత్తవారిని నమ్మకండి. ఖర్చులు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి కూడా ఇది ఇబ్బందులను తీసుకొచ్చే సమయం. కాలసర్ప యోగం వలన ఈ రాశి వారికి టెన్షన్లు పెరిగిపోతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కొత్తవారిని నమ్మకండి. ఖర్చులు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.