ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులను మనం జరుపుకుంటాము. అయితే త్వరలోనే కామిక ఏకాదశి రాబోతోంది. కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి కూడా తెలుసుకుందాం.
కామిక ఏకాదశి 2026

కామిక ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. పంచాంగం ప్రకారం ఏకాదశి ఆగస్టు 8న మధ్యాహ్నం 1:59 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 9న ఉదయం 11:04 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం కామికా ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఆగస్టు 9, ఆదివారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. సోమవారం ఉదయం 5:50 నుంచి 8:00 గంటల మధ్య వ్రతాన్ని విరమించాలి.
ఏకాదశి రోజు ఏం చేస్తే మంచిది?
ఏకాదశి నాడు శాస్త్రోక్త విధానంలో విష్ణువును పూజించాలి. ఉపవాసాన్ని ఆచరించాలి. వీలైనంత ఎక్కువగా శ్రీహరిని స్మరించుకోవాలి. శ్రీహరి నామజపం చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
అలాగే విష్ణు మంత్రాలను కూడా జపించండి. తులసీదేవిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణాలు చేసి, మంత్రాలు చదువుకుని, చివరిగా హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించండి.
ఏకాదశి నాడు చేయకూడని పనులు
ఏకాదశి నాడు తల రుద్దుకోకూడదు. కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఏకాదశి నాడు ఇంటిని కడుక్కోవడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయకూడదు. అలాగే తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు.
ఎందుకంటే ఆ రోజు తులసి కూడా విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్మకం. తులసి ఆకులను కోయడం కూడా మంచిది కాదు. మొక్కను తాకడం కూడా మంచిది కాదు. అయితే ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
ఏకాదశి వ్రత కథ, మంత్రజపం ప్రాముఖ్యత
{{/usCountry}}ఎందుకంటే ఆ రోజు తులసి కూడా విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్మకం. తులసి ఆకులను కోయడం కూడా మంచిది కాదు. మొక్కను తాకడం కూడా మంచిది కాదు. అయితే ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
ఏకాదశి వ్రత కథ, మంత్రజపం ప్రాముఖ్యత
{{/usCountry}}విష్ణు పురాణం ప్రకారం చూసినట్లయితే, ఏకాదశి నాడు "ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా "హరే కృష్ణ మహా మంత్రాన్ని 108 సార్లు జపించండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి వ్రత కథను వినడం లేదా చదవడం చాలా అవసరం. లేకపోతే పూజ సంపూర్ణం కాదు. వ్రత కథ చదువుకుని పూజ చేయడం వలన పూర్తి ఫలితం కలుగుతుంది. విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.