...
...
Next Story

Kanakadhara Stotram: కనకధార స్తోత్రం.. ఈరోజు గురు పుష్యమి వేళ చదువుకుంటే దరిద్ర బాధలను తొలగి, సిరి సంపదలు కలుగుతాయి!

శంకరాచార్యులు సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రార్థించి రచించిన 'కనకధార స్తోత్రం' అపారమైన ఆర్థిక శక్తిని కలిగినది. ఈ స్తోత్ర పఠనం ద్వారా దరిద్ర బాధల నుంచి విముక్తి కలిగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గురు పుష్య యోగం వంటి శుభ సమయాల్లో దీనిని పఠించడం మరింత విశేష ఫలితాలను ఇస్తుంది.

Published on: Jun 18, 2026, 08:00:41 IST
Advertisement

ఆది శంకరాచార్యుల వారు రచించిన కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా లాభాలు కలుగుతాయి. పేద బ్రాహ్మణురాలి ఇంటికి భిక్షాటనకు వెళ్లినప్పుడు ఒక్క ఉసిరికాయను భక్తితో భిక్షగా వేస్తుంది. ఆమె దరిద్రాన్ని చూసి చలించిపోయిన శంకరాచార్యులు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఈ 'కనకధార' స్తోత్రం రాశారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి.

కనకధార స్తోత్రం

Kanakadhara Stotram: కనకధార స్తోత్రం.. ఈరోజు గురు పుష్యమి వేళ చదువుకుంటే, దరిద్ర బాధలను తొలగి, సిరి సంపదలు కలుగుతాయి! (pinterest)
Kanakadhara Stotram: కనకధార స్తోత్రం.. ఈరోజు గురు పుష్యమి వేళ చదువుకుంటే, దరిద్ర బాధలను తొలగి, సిరి సంపదలు కలుగుతాయి! (pinterest)

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్

అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని

మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం

ఆనందకందమనిమేషమనంగతంత్రమ్

ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతీ

కామప్రదా భగవతోపి కటాక్షమాల

కల్యాణమావహతు మే కమలాలయాయాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ

మాతుః సమస్త జగతాం మహనీయమూర్తి

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం

మందాలసం చ మకరాలయకన్యకాయాః

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోపి

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదరసహోదరమిందిరాయాః

ఇష్టావిశిష్టమతయోపి యయా దయాద్ర

దృష్ర్యా త్రివిష్టపపదం సులభం లభంతే

దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః

దద్యాద్దయానోపవనో ద్రవిణాంబుధారాం

అస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయినీ నయనాంబువాహః

యత్కటాక్షసముపాసనావిధిః

సేవకస్య సకలార్థసంపదః

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే

సరిసీజనిలయే సరోజహస్తే

ధవలతమాంశుకగంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్

స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్

ప్రాతర్నమామి జగతాం జననీమశేష

లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్

కమలే కమలాక్షవల్లభే త్వం

కరుణాపూరతరంగితైరపాంగైః

అవలంబయ మాం కరాంబుజేన

మయి కించిత్కరుణాం విధేహి మాతః

యంత్యాం త్రిలోకనిలయం పరమార్థదేవీం

లక్ష్యం జగత్ప్రతినిధిం కమలాలయాయాః

ఏవం మయా సతతమాశ్రిత ముష్టిమధ్యం

వందే స్మితం హరిప్రియే భవతీం నమస్యామ్..

ఈ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో సుఖశాంతులు, ధన లాభం చేకూరుతాయి.

కనకధార స్తోత్రం ఎప్పుడు పఠించాలి?

శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళ, లక్ష్మీదేవిని పూజించిన తర్వాత పఠించడం ఉత్తమం.

గురు పుష్య వేళ ఇలా చేయండి

ఈరోజు గురు పుష్య వేళ రోజున లక్ష్మీదేవి పటాన్ని పూజ గదిలో పెట్టండి.

భక్తితో ఈ 'కనకధార స్తోత్రం' చదువుకోండి. అనేక లాభాలు కలుగుతాయి.

కుదిరితే 'లక్ష్మీ చాలీసా' కూడా పఠించండి.

వీటి ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విజయాలు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe