ఆర్థిక సమస్యలకు కారణం ఇంట్లోని ఈ లోపాలేనా? వాస్తు చెప్పే 4 పరిష్కారాలు ఇవే!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే కొన్ని చిన్న చిన్న లోపాలు కూడా ఆర్థిక అసమతుల్యతకు కారణమవుతాయని చెబుతారు. బీరువా సరైన దిశలో ఉంచడం, నీటి లీకేజీలను నివారించడం వంటి కొన్ని సులభమైన మార్పులు సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయని నమ్మకం. 

Published on: Jun 11, 2026, 12:55:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి.

ఆర్థిక సమస్యలకు కారణం ఇంట్లోని ఈ లోపాలేనా? వాస్తు చెప్పే 4 పరిష్కారాలు ఇవే! (pinterest)
ఆర్థిక సమస్యలకు కారణం ఇంట్లోని ఈ లోపాలేనా? వాస్తు చెప్పే 4 పరిష్కారాలు ఇవే! (pinterest)

ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం సంతోషంగా ఉండాలని, ఐశ్వర్యంతో తులతూగాలని, ఆర్థిక పరిస్థితి బాగుండాలని అనుకుంటారు. మారుతున్న కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి. ఊహించని ఆర్థిక సవాళ్ల కారణంగా చాలామందికి పొదుపు చేయడం కూడా కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా వృథా కాకుండా ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.

వాస్తు నియమాలను పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక అసమతుల్యతకు ఈ చిన్న చిన్న లోపాలే కారణాలు అవ్వచ్చు. కాబట్టి వీటిని తెలుసుకుని పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుంది.

సరైన దిశలో బీరువా లేదా లాకర్

మనం డబ్బులు దాచుకునే చోటు సరైన దిశలో ఉండాలి. వాస్తు ప్రకారం డబ్బును పెట్టే చోటు సరిగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నగలు, బంగారం, ముఖ్యమైన పత్రాలు వంటివి చాలామంది బీరువాలో లేదా లాకర్లలో పెడుతూ ఉంటారు. అయితే బీరువాలు, లాకర్లను ఉత్తర దిశలో పెడితే మంచిది. ఉత్తర దిశ కుబేరుడి దిశ. ఆ దిశలో ఇవి ఉన్నట్లయితే ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు లక్ష్మీదేవి కూడా తాండవిస్తుంది.

కుళాయిల నుంచి నీరు లీక్ అవ్వకూడదు

కుళాయిల నుంచి నీరు బయటకు లీక్ అవ్వకూడదు. ఒకవేళ అలా మీ ఇంట్లో జరుగుతున్నట్లయితే ఆ కుళాయిని రిపేర్ చేయించండి. వాస్తు నమ్మకాల ప్రకారం అలా నీరు వృథాగా పోతున్నట్లయితే ఆ ఇంట్లో సంపద కరిగిపోతుంది. అనవసరమైన ఖర్చుల రూపంలో డబ్బు అంతా కూడా పోతుందని గుర్తు పెట్టుకోండి. కాబట్టి నీటిని వృథా చేయొద్దు. అప్పుడే డబ్బు మీ ఇంట్లో ఉంటుంది.

నీరు వెళ్లే దారి

ఇంట్లో ఉపయోగించిన నీరు బయటకు వెళ్లే దిశ కూడా ముఖ్యమే. ఇంట్లో మురికినీరు లేదా వాడిన నీరు దక్షిణం లేదా ఉత్తర దిశల వైపుగా బయటకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. నీరు సరైన దిశలో ప్రవహిస్తే సానుకూల శక్తి మీ ఇంట్లో ప్రవహిస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.

ఈ పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి

ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిపోయిన సామాన్లు, పనికిరాని వస్తువులు ఉండకూడదు. ఇవి ఇంట్లో పేరుకుపోతే ప్రతికూల శక్తి పెరుగుతుంది. సానుకూల శక్తి దూరం అవుతుంది. కాబట్టి ఈ పొరపాట్లు కూడా చేయకండి.

ఇంట్లో ఒక మంగళ కలశాన్ని స్థాపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఐశ్వర్యాన్ని కూడా ఇది తీసుకొస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ ఇంట్లో చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More