Lucky Rasis: ద్వి-గురు రాజయోగం ప్రభావం.. ఈ వారం 3 రాశుల వారి జీవితమే మారబోతోంది, ఊహించని సంపద యోగం

జూన్ 8 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో గజలక్ష్మి, ద్విగురు రాజయోగాలు కలగబోతున్నాయి. దీనివల్ల మేషం, మిథునం, తులా రాశుల జాతకులకు విపరీతమైన ధనలాభం, కెరీర్‌లో తిరుగులేని విజయాలు లభిస్తాయి.

Published on: Jun 8, 2026, 12:30:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికల ఆధారంగానే వారఫలాలను అంచనా వేస్తారు. జూన్ 8 నుంచి కొత్త వారం ప్రారంభం మొదలయ్యింది. ఈ వారంలో కొన్ని అరుదైన, శక్తివంతమైన గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. జూన్ 2 నుంచే దేవగురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. కాగా, జూన్ 8న రాకుమారుడు శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురు, శుక్రుల కలయిక వల్ల ‘ద్వి-గురు రాజయోగం’, ‘గజలక్ష్మి రాజయోగం’ లాంటి మహా యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. మరోవైపు మేష రాశిలో కుజుడి సంచారం వల్ల ‘రుచక రాజయోగం’ కూడా సిద్ధిస్తోంది.

Lucky Rasis: ద్వి-గురు రాజయోగం ప్రభావం.. ఈ వారం 3 రాశుల వారి జీవితమే మారబోతోంది (pinterest)
Lucky Rasis: ద్వి-గురు రాజయోగం ప్రభావం.. ఈ వారం 3 రాశుల వారి జీవితమే మారబోతోంది (pinterest)

దీనికి తోడు ఈ వారంలో శని దేవుడు మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో కొలువై ఉంటారు. ఈ గ్రహాల ప్రభావం మొత్తం 12 రాశుల వారి జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, జూన్ 8 నుంచి 14 వరకు ఉండే ఈ రోజుల్లో ప్రధానంగా మూడు రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది. ధనలాభంతో పాటు కెరీర్‌లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఆ లక్కీ రాశులేంటో, వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

తులా రాశి

గ్రహాల అనుకూల సంచారం వల్ల తులా రాశి వారికి ఈ వారం ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కీలకమైన బాధ్యతలు లభిస్తాయి. వీటిని విజయవంతంగా పూర్తి చేస్తే ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం మంచిది. కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం ఎంతో శుభప్రదం. దంపతుల మధ్య పరస్పర అవగాహన పెరిగి, దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది.

మేష రాశి

మేష రాశి వారికి జూన్ 8 నుంచి 14 వరకు బంగారమే కానుంది. గ్రహాల అనుకూలత వల్ల నిలిచిపోయిన పనులన్నీ చకచకా సాగుతాయి. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పైఅధికారులు మీకు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను అప్పగిస్తారు. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం వల్ల సంపదపెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతానం నుంచి ఏదైనా శుభవార్త వింటారు. దీనివల్ల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి

గ్రహాల శుభ వీక్షణం వల్ల మిథున రాశి వారికి ఈ వారం తిరుగులేని లాభాలు కలగనున్నాయి. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి విదేశీ కంపెనీల నుంచి పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా నడుస్తున్న మనస్పర్థలు, గొడవలు పూర్తిగా సమసిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More