ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదా? ఈ శివ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందట!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తోందా? వివాహ బంధాన్ని బలపరిచే కొన్ని అద్భుతమైన శివారాధన పరిహారాలు మీకోసం.

Published on: Jun 4, 2026, 15:31:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం సంతోషంగా ఉండాలని, కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి మనం ఇష్టపడిన వారితో పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అయితే మీ ప్రేమ వివాహం వరకు వెళ్లాలా? వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారాలను ట్రై చేసి చూడండి.

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదా? ఈ శివ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందట!
ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదా? ఈ శివ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందట!

సనాతన ధర్మంలో శివ పార్వతుల బంధాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే వారిని ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా భావిస్తారు. శివుడిని భర్తగా పొందడానికి పార్వతి దేవి కఠోరమైన తపస్సు చేసింది. అందుకే ప్రేమించిన వ్యక్తులతో పెళ్లి జరగాలన్నా, వివాహ జీవితంలో ఆనందం ఉండాలన్నా శివపార్వతుల్ని ఆరాధించాలి.

ప్రేమ వివాహంలో కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే ఏదో ఒక ఆటంకం వస్తున్నా భక్తిశ్రద్ధలతో శివుని ఆరాధించడం మంచిదే. శివున్ని పూజించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రేమ పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి సులువైన పరిహారాలను పాటించండి.

ఓం నమః శివాయ

పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పంచాక్షరి మంత్రమైన "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. నిత్యం జపిస్తే మనసు అదుపులో ఉంటుంది. మానసిక ఉల్లాసం పొందవచ్చు. ప్రేమ వివాహం సఫలం అవ్వాలని అనుకుంటున్నట్లయితే ప్రతి రోజూ ఉదయం ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది.

వీటిని సమర్పించండి

శివలింగానికి పెరుగు, పాలు, తేనె, నీళ్లు, మారేడు దళాలు, ఉమ్మెత్త పువ్వులు, తెల్లటి పుష్పాలు, జిల్లేడు పువ్వులు వంటివి సమర్పిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి. శివుని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే జలాభిషేకం, పంచామృతాభిషేకం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు, ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి సానుకూల శక్తులు వ్యాపిస్తాయి.

శివ చాలీసా

శివ పార్వతుల్ని పూజించడం వలన దాంపత్యుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రతిరోజూ శివ చాలీసాను చదువుకోవడం వలన ప్రేమ బంధం మరింత బలపడుతుంది.

బిల్వపత్రాలపై ఇలా పేరు రాయండి

కొంతమంది బిల్వపత్రాలపై చందనంతో ప్రేమికుల పేర్లను రాసి శివలింగానికి సమర్పిస్తారు. అలా చేస్తే కూడా ప్రేమ సక్సెస్ అవ్వచ్చు. పాలు, పెరుగు, తేనెతో శివుడికి అభిషేకం చేస్తే ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెళ్లి అయ్యి సంతోషంగా ఉండొచ్చు. అలాగే గ్రహ దోషాలు కూడా ఈ పరిహారాలతో తొలగిపోతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More