కార్తీక మాసం 2026: శ్రీ శివ అష్టోత్తరం తెలుగులో.. పరమశివుడి 108 నామాలను ప్రతిరోజూ పఠించండి!
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారాలు, ప్రదోష కాలాల్లో శివుడికి అభిషేకాలు చేస్తారు. బిల్వదళాల సమర్పణతో పాటు శివ స్తోత్రాలు, మంత్రాలు పఠిస్తారు. శివుడిని ఆరాధించేందుకు శ్రీ శివ అష్టోత్తర శతనామావళి కూడా తప్పక చదవాలి.
కార్తీక మాసంలో శివుడిని భక్తుశ్రద్ధలతో పూజిస్తారు. అలాగే కార్తీక మాసంలో శివుని ఆరాధించేటప్పుడు శివుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలతో పాటుగా అష్టోత్తరాన్ని కూడా చదువుతారు. శివుడుని ఆరాధించేటప్పుడు చదువుకోవాల్సిన శ్రీ శివ అష్టోత్తర శతనామావళి 108 నామాలు ఇవిగో.

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి – 108 నామాలు
1. ఓం శివాయ నమః
2. ఓం మహేశ్వరాయ నమః
3. ఓం శంభవే నమః
4. ఓం పినాకినే నమః
5. ఓం శశిశేఖరాయ నమః
6. ఓం వామదేవాయ నమః
7. ఓం విరూపాక్షాయ నమః
8. ఓం కపర్దినే నమః
9. ఓం నీలలోహితాయ నమః
10. ఓం శంకరాయ నమః
11. ఓం శూలపాణయే నమః
12. ఓం ఖట్వాంగినే నమః
13. ఓం విష్ణువల్లభాయ నమః
14. ఓం శిపివిష్టాయ నమః
15. ఓం అంబికానాథాయ నమః
16. ఓం శ్రీకంఠాయ నమః
17. ఓం భక్తవత్సలాయ నమః
18. ఓం భవాయ నమః
19. ఓం శర్వాయ నమః
20. ఓం త్రిలోకేశాయ నమః
21. ఓం శితికంఠాయ నమః
22. ఓం శివాప్రియాయ నమః
23. ఓం ఉగ్రాయ నమః
24. ఓం కపాలినే నమః
25. ఓం కామారయే నమః
26. ఓం అంధకాసురసూదనాయ నమః
27. ఓం గంగాధరాయ నమః
28. ఓం లలాటాక్షాయ నమః
29. ఓం కాలకాలాయ నమః
30. ఓం కృపానిధయే నమః
31. ఓం భీమాయ నమః
32. ఓం పరశుహస్తాయ నమః
33. ఓం మృగపాణయే నమః
34. ఓం జటాధరాయ నమః
35. ఓం కైలాసవాసినే నమః
36. ఓం కవచినే నమః
37. ఓం కఠోరాయ నమః
38. ఓం త్రిపురాంతకాయ నమః
39. ఓం వృషాంకాయ నమః
40. ఓం వృషభారూఢాయ నమః
41. ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః
42. ఓం సామప్రియాయ నమః
43. ఓం స్వరమయాయ నమః
44. ఓం త్రయీమూర్తయే నమః
45. ఓం అనీశ్వరాయ నమః
46. ఓం సర్వజ్ఞాయ నమః
47. ఓం పరమాత్మనే నమః
48. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
49. ఓం హవిషే నమః
50. ఓం యజ్ఞమయాయ నమః
51. ఓం సోమాయ నమః
52. ఓం పంచవక్త్రాయ నమః
53. ఓం సదాశివాయ నమః
54. ఓం విశ్వేశ్వరాయ నమః
55. ఓం వీరభద్రాయ నమః
56. ఓం గణనాథాయ నమః
57. ఓం ప్రజాపతయే నమః
58. ఓం హిరణ్యరేతసే నమః
59. ఓం దుర్ధర్షాయ నమః
60. ఓం గిరీశాయ నమః
61. ఓం గిరిశాయ నమః
62. ఓం అనఘాయ నమః
63. ఓం భుజంగభూషణాయ నమః
64. ఓం భర్గాయ నమః
65. ఓం గిరిధన్వనే నమః
66. ఓం గిరిప్రియాయ నమః
67. ఓం కృత్తివాససే నమః
68. ఓం పురారాతయే నమః
69. ఓం భగవతే నమః
70. ఓం ప్రమథాధిపాయ నమః
71. ఓం మృత్యుంజయాయ నమః
72. ఓం సూక్ష్మతనవే నమః
73. ఓం జగద్వ్యాపినే నమః
74. ఓం జగద్గురవే నమః
75. ఓం వ్యోమకేశాయ నమః
76. ఓం మహాసేనజనకాయ నమః
77. ఓం చారువిక్రమాయ నమః
78. ఓం రుద్రాయ నమః
79. ఓం భూతపతయే నమః
80. ఓం స్థాణవే నమః
81. ఓం అహిర్బుధ్న్యాయ నమః
82. ఓం దిగంబరాయ నమః
83. ఓం అష్టమూర్తయే నమః
84. ఓం అనేకాత్మనే నమః
85. ఓం సాత్త్వికాయ నమః
86. ఓం శుద్ధవిగ్రహాయ నమః
87. ఓం శాశ్వతాయ నమః
88. ఓం ఖండపరశవే నమః
89. ఓం అజాయ నమః
90. ఓం పాశవిమోచకాయ నమః
91. ఓం మృడాయ నమః
92. ఓం పశుపతయే నమః
93. ఓం దేవాయ నమః
94. ఓం మహాదేవాయ నమః
95. ఓం అవ్యయాయ నమః
96. ఓం హరయే నమః
97. ఓం పూషదంతభిదే నమః
98. ఓం అవ్యగ్రాయ నమః
99. ఓం దక్షాధ్వరహరాయ నమః
100. ఓం హరాయ నమః
101. ఓం భగనేత్రభిదే నమః
102. ఓం అవ్యక్తాయ నమః
103. ఓం సహస్రాక్షాయ నమః
104. ఓం సహస్రపాదే నమః
105. ఓం అపవర్గప్రదాయ నమః
106. ఓం అనంతాయ నమః
107. ఓం తారకాయ నమః
108. ఓం పరమేశ్వరాయ నమః
ఇతి శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సమాప్తం.. ఓం నమః శివాయ..
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


