కోటి సోమవారం + కార్తీక సోమవారం.. శివుడి అనుగ్రహం కోసం ఈ 6 పనులు తప్పక చేయండి!
కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కోటి సోమవారం, కార్తీక సోమవారం ఒకే రోజు రావడంతో ఈ పర్వదినానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం, అభిషేకాలు, దీపారాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అందులోనూ ఈ రోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం కలిసి వచ్చాయి. కార్తీక మాసంలో శివారాధనకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తారు. అలాగే ఆరోజు ఉపవాసం కూడా ఉంటారు.

ఈ రోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం.. శ్రవణ నక్షత్రం, శుక్ల సప్తమి తిథి కలయికతో ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అభిషేకాలు చేస్తే పుణ్యం వస్తుంది. దీపారాధన, ఉపవాసం, దానధర్మాలు నిర్వహించడం వలన కోటి రెట్ల ఫలితం ఉంటుందని నమ్ముతారు. శివుడి అనుగ్రహం కోసం ఈ రోజు తప్పకుండా ఈ ఆరు పనులు చేయండి.
కోటి సోమవారం + కార్తీక సోమవారం ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి
కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అంకితమైన పవిత్రమైన మాసం. ఈ నెలలో శివుడికి అభిషేకం చేస్తే మంచిది. అలాగే బిల్వపత్రాలను సమర్పించాలి. సాయంత్రం దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
1. జలాభిషేకం చేయండి
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి శివలింగానికి అభిషేకం చేయాలి. 'ఓం నమఃశివాయ' అనే మంత్రాన్ని జపించాలి.
2. శివుడికి బిల్వపత్రాలను సమర్పించండి
శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలను సమర్పించండి. మూడు ఆకులు కలిగిన బిల్వదళాలను భక్తిశ్రద్ధలతో సమర్పించాలి.
3. దీపారాధన
సాయంత్రం దీపారాధన చేయండి. తులసి కోట ముందు దీపాలు వెలిగించి పూజ చేయాలి. అలా చేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. వీలైతే శివాలయంలో కూడా దీపాన్ని వెలిగించొచ్చు.
4. ఓం నమః శివాయ మంత్రం
కోటి సోమవారం, కార్తీక సోమవారం వేళ 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించండి. కుదిరితే శివ చాలీసా, లింగాష్టకం, శివతాండవ స్తోత్రం కూడా పఠించొచ్చు.
5. భక్తిశ్రద్ధలతో ఉపవాసం
కార్తీక సోమవారం వేళ ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేసేవారు కావాలంటే పండ్లు, పాలు తీసుకోవచ్చు.
6. పేదలకు అన్నదానం, దానధర్మాలు
కార్తీక సోమవారం, కోటి సోమవారం రోజున అన్నదానం, దానధర్మాలు వంటివి చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
ఈరోజు మర్చిపోకుండా వీటిని పాటించండి
ఈ రెండు ఒకే రోజు రావడం వలన వీలైనంత ఎక్కువ సమయం శివనామస్మరణతో గడపడం మంచిది. అసూయ, ద్వేషం, కోపం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇతరులను బాధపెట్టకూడదు. పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


