రేపే కోటి సోమవారం.. ఈ ఒక్క పని చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందట! పూజా విధానం తెలుసుకోండి!
కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పర్వదినాల్లో కోటి సోమవారానికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని పంచాంగ సంప్రదాయాల ప్రకారం సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలయికను కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే పూజలు, అభిషేకాలు, దీపారాధనలు, ఉపవాసాలు, దానధర్మాలు కోటి రెట్ల పుణ్యఫలాన్ని అందిస్తాయని భక్తుల విశ్వాసం.
కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా చెబుతారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమితో పాటుగా కోటి సోమవారం లాంటి పర్వదినాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కోటి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించడం వలన పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

చాలా మంది కోటి సోమవారం అంటే ఏంటి? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అసలు కోటి సోమవారం అంటే ఏంటి? రేపు వచ్చే కోటి సోమవారం విశిష్టత ఏంటి? కోటి సోమవారం నాడు శివుడిని ఏ విధంగా ఆరాధించాలి? వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
కోటి సోమవారం అంటే ఏంటి?
కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పర్వదినాల్లో కోటి సోమవారం ఒకటి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చే రోజుకు ఎంతో విశిష్టత ఉంది. కొన్ని పంచాంగ సంప్రదాయాల్లో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలయికను కోటి సోమవారంగా చెబుతారు.
ఆ రోజు చేసే అభిషేకాలు, దీపారాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. అందుకే ఈ పర్వదినాన్ని కోటి సోమవారం అంటారు. ఆ రోజు తప్పకుండా సోమవారమే అవ్వాలని లేదు.
కోటి సోమవారం విశిష్టత
కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం, దీపారాధన చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. కోటి సోమవారం నాడు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన పాపవిముక్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఇలా అనేక విధాలుగా లాభాలను పొందవచ్చని భక్తుల విశ్వాసం.
కోటి సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి?
శివలింగానికి అభిషేకం చేయాలి. బిల్వపత్రాలను శివుడికి భక్తితో సమర్పించాలి. దీపారాధన చేయాలి. 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే మంచిది. అలాగే కోటి సోమవారం నాడు దానధర్మాలు చేస్తే కూడా మంచిది.
కోటి సోమవారం నాడు ఈ ఒక్క పని చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది
కోటి సోమవారం నాడు శివుడికి కచ్చితంగా జలాభిషేకం చేయండి. ఇది శివుడికి చాలా ప్రీతికరమైనది.
ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శుద్ధమైన నీటితో అభిషేకం చేయాలి.
అభిషేకం చేసేటప్పుడు 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


