...
...
Next Story

కార్తీక పౌర్ణమి ఎప్పుడు? నవంబర్ 4న, 5న? స్నానం, పూజా ముహూర్తంతో పాటు 365 వత్తులు వెలిగించే విధానం తెలుసుకోండి!

కార్తీక మాసం చాలా విశేషమైనది. నెల రోజులు పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది జరుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో, కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం.

Published on: Oct 27, 2025, 08:00:14 IST
Advertisement

కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఇంత అంతా కాదు. కార్తీక మాసం చాలా విశేషమైనది. నెల రోజులు పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివాలయాల్లో అభిషేకాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు. నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో, కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది?

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? (pinterest)
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? (pinterest)

పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30కి మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. నవంబర్ 5న పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి పౌర్ణమిని ఆ రోజే జరుపుకోవాలి. చాలా మంది నదీ స్నానం చేసి, దీపారాధన చేసి పరమభక్తితో శివుడిని ఆరాధిస్తారు. పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి.

నదీ స్నానం ఏ సమయానికి చేయాలి?

కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44 వరకు చేస్తే మంచిది. పూజ చేయడానికి ఉదయం 7:58 నుంచి ఉదయం 9 వరకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు.

365 వత్తులు:

కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది జరుగుతుంది. చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉండి 365 వత్తులు వెలిగించుకుంటారు. 365 వత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసిన రోజూ దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు. దీపారాధన చేయని ఫలితం పోకుండా, భగవంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు.

ఉసిరికాయల దీపారాధన:

365 వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు, కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు. ఈ వత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది. అలాగే ఇంటి యజమాని ఈ 365 వత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. 365 వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి “దామోదరం ఆవాహయామి” లేదా “త్రయంబకం ఆవాహయామి” అని చెప్పాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe