కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? కార్తీక పురాణం ప్రకారం దీని మహత్యం తెలుసుకోండి!

కార్తీక మాసం అక్టోబర్ 22న ప్రారంభమైంది. కార్తీకమాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశదీపం వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు. దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశదీపాన్ని చూసి నమస్కరిస్తారు.

Published on: Oct 25, 2025, 13:30:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసం అంటే ఎంతో పుణ్యం ఉన్న నెల. ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో పూజలు, అభిషేకాలు, వ్రతాలు ఇలా ఎవరికి నచ్చినవి వారు చేస్తూ, ఎవరికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. కార్తీక మాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

కార్తీక మాసంలో ఆకాశదీపం (pinterest)
కార్తీక మాసంలో ఆకాశదీపం (pinterest)

కార్తీక మాసం 2025

ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ 22న ప్రారంభమైంది. నవంబర్ 20 వరకు కార్తీకమాసం కొనసాగుతుంది. కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఈ ఏడాది మొదటి సోమవారం అక్టోబర్ 27న, రెండవ సోమవారం నవంబర్ 3న, మూడవ సోమవారం నవంబర్ 10న, నాలుగవ సోమవారం నవంబర్ 17న వచ్చాయి. ఈ కార్తీకమాసంలో ఆకాశదీపం వెలిగిస్తారు. అసలు కార్తీకమాసంలో ఎందుకు ఆకాశదీపాన్ని వెలిగిస్తారు? దీని మహత్యం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో ఆకాశదీపం

కార్తీకమాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశదీపం వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు. దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశదీపాన్ని చూసి నమస్కరిస్తారు.

పితృదేవతలకు మార్గం

ఆకాశదీపం పితృదేవతలకు మార్గం చూపుతుందని అంటారు. వారికి దారి చూపడం కోసం ఇలా కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది. ఈ దీపాన్ని చూసి పితృ దేవతల్ని స్మరిస్తే కూడా మంచి జరుగుతుంది. అలాగే ఆకాశ దీపం కాంతిలో ఉన్న ప్రాంతమంతా శివయ్య కాపాడతాడని నమ్ముతారు.

శివ కేశవుల తేజస్సు

కొంతమంది ఇళ్లల్లో కూడా ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు. పితృదేవతలకు త్రోవ కనిపించాలనే ఉద్దేశ్యంతో కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని కడతారు. పితృదేవతలు ఆకాశమార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తారట. అందుకనే ఆ సమయంలో వారికి త్రోవ సరిగా కనపడటానికి దేవాలయాల్లో ఆకాశదీపాన్ని పెడతారు.

ఈ దీపం శివ కేశవుల తేజస్సును జగత్తుకి అందిస్తుందని నమ్ముతారు. శివకేశవులు శక్తితో ఆకాశదీపం ధ్వజస్తంభం పై నుంచి మొత్తం భూమంతటికి వెలుతురును అందిస్తారని, అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయని అంటారు.

ఆకాశదీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి: “దామోదర మావాహయామి త్రయంబక మావాహయామి”

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More