చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. హిందూ సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం మొదలు, ప్రతి గది, ప్రతి దిశ కూడా నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ఉత్తర దిశకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు ప్రకారం ఈ దిశకు అధిపతి కుబేరుడు, సంపదల తల్లి లక్ష్మీదేవి అధిపతులుగా వ్యవహరిస్తారు. ఉత్తర దిశ సానుకూల శక్తికి, కెరీర్ పరంగా అభివృద్ధికి, ఆర్థిక సమృద్ధికి ప్రత్యేక ప్రతీక. వాస్తు జ్యోతిష్యం ప్రకారంగా చూసినట్లయితే, ఈ దిశలో సరైన వస్తువులను పెట్టినట్లయితే ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

ఒకవేళ పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచినట్లయితే వాస్తు దోషాలు ఏర్పడతాయి. తీవ్రమైన సమస్యలు వస్తాయి. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న, ఆర్థికంగా నష్టపోతున్న వారు ఇంటి ఉత్తర దిశలో ఎలాంటి వస్తువులు ఉన్నాయనేది చూసుకోవాలి. పొరపాటున కూడా ఉత్తర దిశలో వీటిని పెట్టకండి. వీటివలన అనేక నష్టాలు కలుగుతాయి. ఉత్తర దిశలో పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి.. తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది
చెప్పులు స్టాండ్, చెత్తబుట్ట
ఇంటి ఉత్తర దిశలో చెప్పుల స్టాండ్ లేదా చెత్తబుట్టను పెట్టొద్దు. ఇవి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. ప్రతికూల శక్తి వేగంగా వ్యాపిస్తుంది. విపరీతమైన ధన నష్టం, మానసిక అశాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి.
బరువుగా ఉండే ఫర్నిచర్
వాస్తు ప్రకారం బరువుగా ఉండే ఫర్నిచర్ ఇంట్లో సంపదను కరిగించేస్తాయి. అలాగే ఉత్తర దిశలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఉత్తర దిశ శుభ్రంగా ఉంటేనే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సమస్యలు రావు. ప్రతికూల శక్తి కూడా ఉండదు.
ఎలక్ట్రానిక్ పరికరాలు
వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండకూడదు. అలాగే వంట గదికి సంబంధించిన సామాగ్రిని కూడా ఉత్తర దిశలో పెట్టకూడదు. ఇవి అనేక సమస్యల్ని కలిగిస్తాయి. ప్రతికూల శక్తికి కారణమవుతాయి. వాస్తు సమతుల్యత కూడా వీటి కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే స్టవ్ లేదా వంటగదికి సంబంధించిన అగ్ని సంబంధిత వస్తువులు అగ్ని మూలకానికి చెందినవి కాబట్టి, నీరు, అగ్ని పరస్పర వ్యతిరేకాంశాలు కనుక ఉత్తర దిశలో వీటిని పొరపాటున కూడా పెట్టొద్దు.
చీపురు
ఇంట్లో శుభ్రం చేసే చీపురును ఉత్తర దిశలో పెడితే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కుబేరుడు నివసించే ఉత్తర దిశలో చీపురును పెడితే సిరి సంపదలు కరిగిపోతాయి. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
{{/usCountry}}ఇంట్లో శుభ్రం చేసే చీపురును ఉత్తర దిశలో పెడితే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కుబేరుడు నివసించే ఉత్తర దిశలో చీపురును పెడితే సిరి సంపదలు కరిగిపోతాయి. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
{{/usCountry}}