ఈ 5 ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే కుబేరుడు అంత ధనవంతులు అవ్వచ్చు.. ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు!

సాముద్రిక శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క పుట్టుమచ్చ వెనుక అర్థం ఉంటుంది. ఇవి మచ్చలు మాత్రమే కాదు, ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వానికి అద్దం వంటివి. కొన్ని పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయి, కొన్ని తర్వాత ఏర్పడతాయి. మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం అదృష్టానికి సంకేతం.

Published on: Jan 6, 2026, 15:00:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాముద్రిక శాస్త్రం ద్వారా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క పుట్టుమచ్చ వెనుక ఒక అర్థం ఉంటుంది. ఇవి చర్మంపై ఉన్న మచ్చలు మాత్రమే కాదు, ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వానికి అద్దం వంటివి. కొన్ని పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయి, కొన్ని తర్వాత ఏర్పడతాయి. అయితే మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం అదృష్టానికి సంకేతం.

ఈ 5 ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే కుబేరుడు అంత ధనవంతులు అవ్వచ్చు (pinterest)
ఈ 5 ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే కుబేరుడు అంత ధనవంతులు అవ్వచ్చు (pinterest)

ఆర్థికపరంగా కూడా బావుంటుందని తెలుపుతాయి. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే నిజంగా అదృష్టం వరించినట్లే. సంతోషం, సంపదతో కలకాలం ఉండొచ్చు. మరి ఏ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే సంపదతో ఆనందంగా ఉండొచ్చో తెలుసుకుందాం.

ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే కుబేరుడు అంత ధనవంతులు అవ్వచ్చు

1.నుదుటిపై పుట్టుమచ్చ

ఎవరికైనా నుదుటిపై కుడి వైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే, అది చాలా శుభప్రదమైనదిగా భావించాలి. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెలివైన వారు. పైగా కష్టపడి పనిచేస్తారు. ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నవారికి ఎప్పుడూ డబ్బు కొరత కూడా రాదు. సమాజంలో గౌరవం, మర్యాదలు కూడా లభిస్తాయి.

2.మెడపై పుట్టుమచ్చ

ఎవరికైనా మెడ వద్ద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి రాజయోగమే. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మంచి పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా మాట్లాడగలరు. అలాగే ఎంతో శక్తివంతమైన వారు. ఎప్పుడూ కూడా ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఆర్థిక కొరత రాదు. ఆనందంగా ఉంటారు. సంపదకి లోటు ఉండదు.

3.బొడ్డు దగ్గర పుట్టుమచ్చ

ఎవరికైనా బొడ్డు దగ్గర పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వరించినట్లు అర్థం చేసుకోవాలి. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నవారు మంచి, రుచికరమైన ఆహార పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి డబ్బు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.

4.ముక్కు దగ్గర పుట్టుమచ్చ

ఎవరికైనా ముక్కు కుడి వైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులు. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అదృష్టం కలిసి వస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. అలాగే ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఎప్పుడూ డబ్బు కొరత కూడా రాదు. ఆనందంగా ఉంటారు.

5.కుడి అరచేతిపై పుట్టుమచ్చ

సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేతిపై పుట్టుమచ్చ ఉన్న వారిని కూడా స్పెషల్‌గా భావించాలి. ముఖ్యంగా కుడి అరచేతి పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే డబ్బుకు లోటు ఉండదు. సంతోషానికి కొదవ ఉండదు. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More