ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం రోజే కుజుడు ఆర్దుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. రాహువు ఆధిపత్యం ఉన్న ఈ నక్షత్ర సంచారం వల్ల కన్య, మీన, తులా రాశుల వారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఏర్పడే పవిత్రమైన రోజే గ్రహాల సేనాపతి అయిన కుజుడు తన నక్షత్రాన్ని మారుస్తున్నాడు. ఆగస్టు 12, 2026 న కుజుడు రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. సెప్టెంబర్ 2 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తి, భూమికికారకుడిగా భావిస్తారు. అలాగే రాహువును ఆకస్మిక పరిణామాలు, భ్రమలకు కారకుడిగా చెబుతారు.
కుజ సంచారం
గ్రహాల సేనాపతి రాహువు నక్షత్రంలోకి ప్రవేశించడం చాలా కీలకమైన పరిణామం అని ప్రముఖ జ్యోతిష్యులు నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించారు. సూర్య గ్రహణం లాంటి అశుభ సమయంలో ఈ నక్షత్ర మార్పు జరగడం వల్ల కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలం అత్యంత లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి
కుజుడి నక్షత్ర మార్పు కన్య రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్లు కుటుంబంలో మిమ్మల్ని వేధించిన సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో పనులన్నీ సజావుగా సాగుతాయి.
ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. అదృష్టం తోడు నిలిచి ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీన రాశి
మీన రాశి వారికి ఈ నక్షత్రంలో కుజుడి సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ సుఖ-సౌభాగ్యాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పాత మార్గాల ద్వారా కూడా ధనలాభం కలుగుతుంది.
వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. తండ్రి గారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళతారు.
తులా రాశి
{{/usCountry}}వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. తండ్రి గారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళతారు.
తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ, ఆర్థికంగా మంచి లాభాలను అందిస్తుంది. మీ మాటతీరు, వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. అయితే ధనలాభంతో పాటు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయానికి, ఖర్చులకు మధ్య సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.
కార్యాలయంలో అనవసర రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే మీ మంచి పేరు దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారం పరంగా సాధారణ వాతావరణం ఉంటుంది. కొత్త పనులను ప్రారంభించడానికి మాత్రం ఇది సరైన సమయం కాదు.
ఈ మూడు రాశులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
మరోవైపు, కుజుడు రాహువు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేషం, వృశ్చికం, సింహ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురుకావచ్చు. ఈ రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
తొందరపాటులో లేదా భావోద్వేగాలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. డబ్బు లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉన్నందున అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.