ఆగస్టు 1 నుంచి రాహువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా?

ఆగస్టు 1న రాహువు కుజుడికి చెందిన ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించడంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక యోగం ప్రభావం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల కోపం, ఆవేశం, మొండి స్వభావం పెరగడం, ప్రమాదాలు లేదా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Published on: Jul 31, 2026, 11:01:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 1న రాహువు కుజుడికి చెందిన ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల రాహువు, కుజుల కలయికతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడనుంది. ఇంతకాలం తన సొంత నక్షత్రంలో సంచరించిన రాహువు, ఇప్పుడు కుజ నక్షత్రంలోకి అడుగుపెడుతుండటంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే, మరికొన్ని రాశుల వారు తీవ్ర హెచ్చరికలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది అంగారక యోగాన్ని తెచ్చిపెట్టనుంది. అసలు రాహువు అంటే ఏమిటి? ఈ నక్షత్ర మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం.

ఆగస్టు 1 నుంచి రాహువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా?
ఆగస్టు 1 నుంచి రాహువు నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా?

రాహువు అంటే ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది?

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఈ రెండు గ్రహాల స్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పౌరాణిక కథల ప్రకారం, సముద్ర మధనం సమయంలో అమృతం పంచే తరుణంలో రాహువు తల భాగాన్ని శ్రీహరి వేరు చేయగా, ఆ తల భాగమే రాహువుగా మారింది. కాగా మొండెం భాగం కేతువుగా శ్రీహరి పాదాల చెంత చేరి మోక్షాన్ని పొందింది.

రాహువును వాయు తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇది నేరుగా మనిషి ఆలోచనలు, మెదడును ప్రభావితం చేస్తుంది. రాహువు ఏ గ్రహంతో జతకడితే, ఆ గ్రహం యొక్క మంచి గుణాలను గ్రహించి, తన స్వభావాన్ని వాటికి అంటిస్తుంది.

రాహు-కుజుల కలయిక: అంగారక యోగం ప్రభావం

కుజుడి నక్షత్రంలోకి రాహువు ప్రవేశించడం వల్ల అత్యంత ప్రభావవంతమైన 'అంగారక యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మనుషుల్లో కోపం, దూకుడు స్వభావం విపరీతంగా పెరుగుతాయి.

చిన్న విషయాలకే ఉద్రిక్తతకు గురికావడం, మొండి పట్టుదల ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా అనుకోని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు (సర్జరీలు) జరిగే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. కుటుంబంలోనూ ప్రశాంతత కరువై, నిరంతరం అశాంతి నెలకొంటుంది.

ఏ రాశుల వారికి ఈ గోచరం వల్ల అదృష్టం వస్తుంది?

ఈ రాశుల మార్పు ప్రతి ఒక్కరికీ చెడు చేస్తుందని అనుకోవడానికి లేదు. కొన్ని రాశుల వారికి రాహువు నక్షత్ర మార్పు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతోంది:

కుంభ రాశి: ఈ రాశి వారికి రాహువు గోచరం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. కమ్యూనికేషన్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసే వారికి ఊహించని లాభాలు అందుతాయి.

తులా రాశి: తులా రాశి వారికి పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు దక్కే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

మిథున రాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఊహించని ఉన్నతితో పాటు కొత్త బాధ్యతలు మీ చేతికి వస్తాయి.

మేష రాశి: ఆర్థిక పరిస్థితి బలోపేತమవుతుంది. గతంలో మీరు చేసిన సరైన ప్రణాళికలు ఇప్పుడు అకస్మాత్తుగా మంచి ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయతీరాలకు చేర్చుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More